రామాయంపేట, న్యూస్‌లైన్: డబ్బు కోసం సివిల్ ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసిన నలుగురు కిడ్నాపర్లను అరెస్టు చేసినట్లు సీఐ గంగాధర్ తెలిపారు. గురువారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ పట్టణం దుబ్బ ప్రాంతానికి చెందిన సివిల్ ఇంజనీర్ అల్లాడి నాగరాజును ఈ నెల 1వ తేదీన కిడ్నాప్ చేసి రూ. 15 లక్షలు తీసుకురావాలని కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. అయితే కిడ్నాపర్ల చెర నుంచి నాగరాజు తప్పించుకుని తమకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కిడ్నాపర్ల కోసం వెతికి గురువారం తెల్లవారుజామున నలుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.
వీరిలో చేగుంట మండలం నార్సింగి గ్రామానికి చెందిన జెట్టి శ్రీనివాస్, కుక్కల రవీందర్‌లను నార్సింగిలో, రామాయంపేట మండలం నస్కల్ గ్రామానికి చెందిన పాతూరి ఎల్లాగౌడ్, దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామానికి చెందిన కాకి స్వామిలను సిద్దిపేట బస్టాండ్‌లో పట్టుకున్నట్లు తెలిపారు. మరో ఇద్దరు వ్యక్తులు నార్సింగి శ్రీనివాస్, కుక్కల మల్లేశంలు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ ప్రవీణ్‌బాబు, ఏస్‌ఐ బాలకృష్ణారెడ్డి, ఐడీ పార్టీ కానిస్టేబుల్ పెంటయ్య, రాజ్‌కుమార్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
నలుగురు కిడ్నాపర్ల అరెస్టు
Published Fri, Aug 23 2013 2:21 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
Advertisement
Advertisement