హైదరాబాద్ : దక్షిణభారత హిందీ ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత హిందీ తరగతులను విద్యార్థులు ఉపయోగించుకుని వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని శ్రీ వేంకటేశ్వర హిందీ మహా విద్యాలయ కార్యదర్శి చవాకుల నరసింహమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక, మధ్యమ, రాష్ట్రభాష, ప్రవేశిక, విశారద, ప్రవీణ తరగతులు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ సదవాకాశం వినియోగించుకుని జాతీయ భాష హిందీని అభ్యసించాల్సిందిగా కోరారు. ఈ ఉచిత హిందీ తరగతులు హైదరాబాద్ విజయనగర్‌కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సాయంత్రం 4 గంటల నుంచి 6:30 గంటల వరకు ఉంటాయన్నారు. ఆసక్తిగల విద్యార్థులు 99081 25333 నంబర్‌ను సంప్రదించవచ్చు.