కడప రూరల్, న్యూస్‌లైన్ : మెప్మా, అపిట్కో హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ అసిస్టెంట్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషన్‌లలో మూడు నెలలపాటు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అపిట్కో జిల్లా సమన్వయకర్త రామకృష్ణారెడ్డి, శిక్షణా నిర్వాహకుడు ఎస్.గౌస్‌బాషా ఒక ప్రకటనలో తెలిపారు. మూడు నెలల ఉచిత సాంకేతిక శిక్షణతోపాటు ఉపాధి కలిగించే కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.
ఈనెల 15వ తేదీ నుంచి శిక్షణను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత, 18-35 లోపు వయస్సు అర్హత కలిగి, కడప పట్టణంలో నివసించేవారై ఉండాలన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు డోర్ నెం 1/2237, ఎంఐజీ 23ఏ, ఎల్‌ఐసీ సర్కిల్, ఆర్‌ఎస్‌రోడ్డు, ప్రసాద్ గ్యాస్ దగ్గర అనే చిరునామాలో సంప్రదించాలన్నారు. అలాగే 9491417490, 9989334063, 99127 71325 అనే నంబర్లలో కూడా సంప్రదించవచ్చన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
Published Fri, Nov 8 2013 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
Advertisement