కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : నూతన సంవత్సర సందర్భంగా పలువురు అధికారులు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి పథంలో పయనించేందుకు అధికారులు, సిబ్బంది సహకారం అందించాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ లబ్ధిదారుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అన్ని రంగాల్లో ముందుండి జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచేలా అధికారులు కృషి చేయాలన్నారు.
నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలంతా వారి వారి రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తొలుత కలెక్టర్ రఘునందన్‌రావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ చక్రధరరావును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎస్పీ జే ప్రభాకరరావు, జాయింట్ కలెక్టర్ పీ ఉషాకుమారి, ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో విజయచందర్, జెడ్పీ సీఈవో బీ సుబ్బారావు, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, డీఈవో డీ దేవానందరెడ్డి, ఆర్‌వీఎం పీవో బీ పద్మావతి, డీపీఆర్వో కే సదారావు, బందరు ఆర్డీవో పీ సాయిబాబు, కలెక్టర్ ఏవో పీ ఇందిరాదేవి కలెక్టర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విందు కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జాప్ నాయకుల శుభాకాంక్షలు...
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కలెక్టర్‌ను జాప్ సంఘం నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బడే ప్రభాకర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని కలెక్టర్‌ను కోరారు. బాయిరెడ్డి అక్కయ్యబాబు, ఈదా రాంబాబు, జే అబ్రహం పాల్గొన్నారు.
ఆంధ్రాబ్యాంకు సిబ్బంది....
ఆంధ్రాబ్యాంకు ఫౌండర్స్ సీనియర్ బ్రాంచ్ మేనేజరు మెహర్‌కృష్ణ కలెక్టర్‌ను కలసి శుభాకాంక్షలు తెలిపారు. బ్యాంకు రికవరీ మేనేజరు రామారావు ఉన్నారు.
అన్ని రంగాల్లో ముందుండండి
Published Thu, Jan 2 2014 1:34 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
Advertisement
Advertisement