భవిష్యత్ వైఎస్సార్‌సీపీదే..
Published Sun, Dec 8 2013 3:21 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమని పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు, విశాఖ జిల్లా ప్రచార కమిటీ పరిశీలకుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. కొండవాడ పంచాయతీ వత్తాడ గ్రామానికి చెందిన 80 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. ఈ సందర్భంగా గ్రామంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు కనుమరుగవుతాయని చెప్పారు. కాంగ్రెస్ పాలకులు ప్రజా సమస్యలను గాలికొదిలేశారని ఆరోపించారు. అనంతరం గ్రామానికి చెందిన బిడ్డిక గయారి, బిడ్డిక కుమారి, బిడ్డిక సోమమ్మ, తాడంగి ఆవిటమ్మ, మాలతమ్మ, ఈరమ్మ, గంటా జయంతి, నిమ్మక రాసమ్మ, గోవిందరావు, రాజు, బిడ్డిక సీతయ్య, తాడంగి కొండలరావు, పత్తిక సూర్యనారాయణ, శ్రీనివాస్, తదితరులకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పత్తిక లక్ష్ముయ్య, నిమ్మక గోపాల్, రెల్ల సర్పంచ్ కుంబురిక దీనమయ్య, పి.లేవిడి సర్పంచ్ పత్తిక ఇందిర, వత్తాగ సర్పంచ్ తాడంగి రాద, తాడంగి రాజు, జి.సత్యవతి, కడ్రక జంగం మాస్టారు, శేషాపాత్రుడు, నిమ్మక జేసురాజు, తదితరులు పాల్గొన్నారు.
30 కుటుంబాల చేరిక
కొత్తూరు(కొత్తవలస) : కొత్తూరుగొప్పు హరిజన కాలనీకి చెందిన 30 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. వీరందరికీ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బోకం శ్రీనివాస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోకం శ్రీనివాస్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలు సుఖంగా ఉండాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలోకి తొక్కుతోందని ఆరోపించారు. రానున్న రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన కె.గురువులు, కె.దేముడు, కె.బంగారయ్య, బి.కన్నమ్మ, బి.సత్యవతి, ఆర్.కొండమ్మ, తదితరులు మాట్లాడుతూ, రాజశేఖరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఆయన రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే పార్టీలోకి చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వై.మాధవరావు, చీడివలస సర్పంచ్ మేడపురెడ్డి ఈశ్వరరావు(శంకర్), అడిగర్ల సంతోష్, నంబారు కిరణ్, బాలకృష్ణ, పెదిరెడ్ల శ్రీనివాసరావు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement