Govinda Rao
-
తపట్నం అసెంబ్లీ టికెట్ కలమట కుటుంబానికి దక్కుతుందా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నంలో టీడీపీ టికెట్ రేసు అనేక మలుపులు తిరుగుతోంది. కింజరాపు కుటుంబం ఒకరికి హ్యాండ్ ఇవ్వడంతో ఇక్కడ రాజకీయం రసకందాయంలో పడింది. పార్టీ కోసం పనిచేస్తున్న మామిడి గోవిందరావును లక్ష్యంగా చేసుకుని కింజరాపు ఫ్యామిలీ రాజకీయాలు చేస్తోంది. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను అచ్చెన్నాయుడుతో పాటు ఎంపీ రామ్మోహన్నాయుడు వెనకేసుకొస్తున్నారు. అచ్చెన్నాయుడు ఇంతకుముందు చెప్పినట్టు మామిడి గోవిందరావు చేత డబ్బులు ఖర్చు పెట్టించుకుని, కొన్నాళ్లు వాడుకుని ఆ తర్వాత వదిలేస్తామన్న వ్యాఖ్యలు నిజం చేస్తున్నారు. దీన్ని పసిగట్టిన మామిడి కూడా అప్రమత్తమయ్యారు. వీళ్లని కాదని ఏకంగా లోకేష్‌తో టచ్‌లోకి వెళ్లారు. తనకే సీటు వస్తుందని నియోజకవర్గంలో పార్టీ పరంగా బల నిరూపణ చేసుకుంటున్నారు. దానికి తన పుట్టిన రోజున వేదికగా చేసుకుని కలమట వెంకటరమణకు, ఆయనకు మద్దతుగా ఉన్న కింజరాపు ఫ్యామిలీకి పరోక్షంగా సవాల్ విసిరారు. రెండు వర్గాలుగా విడిపోయి.. పాతపట్నంలో టీడీపీ గ్రూపు రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. కార్యకర్తలు ఎవరివైపు ఉండాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. జిల్లాకు పెద్ద దిక్కు అనుకుంటున్న కింజరాపు ఫ్యామిలీ ఎత్తుగడలను అంచనా వేయలేక తీవ్రంగా నలిగిపోతున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు రెండు వర్గాలుగా విడిపోయారు. మొదట్లో పార్టీ కేడర్‌లో కొంత బలంగా కలమట కనిపించినా మామిడి గోవిందరావు వ్యూహాత్మక రాజకీయాలతో ఆ పార్టీలోని కీలక నాయకులను తనవైపు తిప్పుకుంటున్నారు. చెప్పాలంటే టీడీపీ కేడర్‌ను నిట్టనిలువునా చీల్చేశారు. మొన్నటికి మొన్న ఎల్‌ఎన్‌పేట మండల పార్టీ నాయకులు వెలమల గోవిందరావు, కాగన మన్మధరావును తనవైపు తిప్పుకోగా, తాజాగా హిరమండలం పార్టీ నాయకులు యాళ్ల నాగేశ్వరరావును తనవైపు లాక్కున్నారు. ఇలా ఒక్కొక్కరిగా కలమట అనుచరులు, పార్టీ నాయకులను మామిడి గోవిందరావు తన వెంట తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇలా జరుగుతుందని పసిగట్టే గతంలో కలమట వెంకటరమణ కింజరాపు ఫ్యామిలీ వద్ద పంచాయితీ పెట్టారు. మామిడిని ప్రోత్సహించవద్దని మొర పెట్టుకున్నారు. ఈ సమయంలో కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు డబుల్ గేమ్ ఆడారు. ‘వాడుకుని వదిలేద్దామని...పార్టీ కోసం బాగా ఖర్చు పెట్టించి, తద్వారా నీకు మేలు జరిగేలా చూస్తామని’ కలమట వెంకటరమణ వద్ద అచ్చెన్నాయుడు బాహాటంగానే వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి సంచలనం సృష్టించింది. ఇదే సమయంలో మామిడి గోవిందరావు వద్ద ‘నీకెందుకు మేమున్నాం.. కలమటను పట్టించుకోవద్దు.. ఆయన అలాగే మాట్లాడుతాడు. మేము అసలు పట్టించుకోం.. నీ పని నువ్వు చేయ్’ అంటూ ప్రోత్స హించారు. ఇలా ఇద్దరి మధ్య చిచ్చు పెడుతూ ఒకరికి తెలియకుండా మరొకరిని సమర్థించారు.తర్వాత పార్టీలో పరిణామాలు మారిపోయాయి. కింజరాపు ఫ్యామిలీని కలమట వెంకటరమణ ఏ రకంగా బ్లాక్ మెయిల్ చేశారో గానీ మామిడి గోవిందరావుకు మద్దతు లేకుండా చేయగలిగారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు కూడా మామిడిని దూరం పెడుతున్నారు. తరుచూ కలుద్దామని ప్రయత్నిస్తున్న మామిడి అండ్ కోకు అకాశమివ్వడం లేదు. డైరెక్ట్‌గా కలమటకు మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఇదంతా గమనించిన మామిడి కూడా తన రాజకీయ వైఖరిని మార్చుకున్నారు. కింజరాపు నీడ నుంచి బయటపడి లోకేష్ వద్దకు చేరుకున్నారు. లోకేష్‌తో టచ్‌లోకి వెళ్లి కింజరాపు ఫ్యామిలీ వ్యూహాలకు దీటుగా రాజకీయాలు చేస్తున్నారు. అదే సందర్భంలో కింజరాపు ఫ్యామిలీ మద్దతిస్తున్న కలమట వెంకటరమణకు నియోజకవర్గంలో బలం లేదని నిరూపించేందుకు తరచూ ప్రయత్నిస్తున్నారు. చెప్పాలంటే కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడుకు సవాల్ విసిరేలా బల నిరూపణ చేస్తున్నారు. ఇటీవల జరిగిన తన పుట్టిన రోజు వేడుకను కూడా బల నిరూపణ సభగా మార్చేశారు. ఆ వేదికపై కలమట వెంకటరమణే లక్ష్యంగా చెలరేగిపోయారు. గతంలో అవినీతి చేసిన కలమటకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కింజరాపు ఫ్యామిలీ మద్దతిస్తున్న కలమట వెనక ఎవరూ లేరన్నట్టుగా మండలాల వారీగా నాయకులను తనవైపు తిప్పుకుని వేదికపైనే బల ప్రదర్శనగా చూపించారు. ఇదంతా చూసి మామిడిని కూడా అదును చూసే దెబ్బకొట్టే పనిలో కింజరాపు ఫ్యామిలీ ఉన్నట్టుగా నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. -
కీచక మారుతండ్రికి రెండు జీవిత ఖైదులు
ఖలీల్‌వాడి: కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడి హతమార్చిన ఓ మారుతండ్రికి కోర్టు తగిన శిక్ష విధించింది. ఐదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలు స్తూ రెండు జీవితఖైదులు విధించింది. ఈ మేరకు నిజామాబాద్ ప్రత్యేక పోక్సో కోర్టు ఇన్చార్జి సెషన్స్ జడ్జి సునీత కుంచాల శనివారం తీర్పు చెప్పారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన దేవకత్తె గోవింద్రావు బతుకుదెరువు కోసం కొన్నేళ్ల కిందట హైదరాబాద్ వచ్చాడు. అక్కడ భర్తను విడిచిపెట్టి ఐదేళ్లు, రెండేళ్ల వయసుగల ఇద్దరు కూతుళ్లతో ఉంటున్న ఓ మహిళ పరిచ యం కావడంతో ఆమెతో సన్నిహితంగా ఉండేవాడు. ఆ తర్వాత వారు వివాహం చేసుకొని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం(బీ) గ్రామంలో ఓ వ్యవసాయదారుని వద్ద జీతానికి పనిచేస్తున్నారు. అయితే గతేడాది పెద్ద బాలి క కాలికి గాయం కావడంతో గోవింద్రావు 2022 అక్టోబర్ 20న అదే గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడు వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించాడు. అనంతరం బాలికను నేరుగా ఇంటికి తీసుకురాకుండా మెంట్రాజ్‌పల్లి వెళ్లే దారిలోని పొలంలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. బాలిక ప్రతిఘటించడంతో తీవ్రంగా గాయపరిచాడు. స్పృహ కోల్పోయిన బాలికను ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు నడుచుకుంటూ వెళ్లిన బాలిక అపస్మారకస్థితిలో ఉండటంతో ఏం జరిగిందో చెప్పాలని బాలిక తల్లి నిలదీసింది. దీంతో గోవింద్రావు అసలు విషయం చెప్పడంతో బాలికను తల్లి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, ఆపై అక్కడి నుంచి హైదరాబాద్ నిలోఫర్‌కు తీసుకెళ్లింది. కానీ అప్పటికే బాలిక మృతి చెందింది. తల్లి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి న నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ముద్దాయి నేరం ఒప్పుకోలు స్వాధీన పంచనామా, సీసీటీవీ ఫుటేజీ, బాలిక పోస్ట్‌మార్టం నివేదిక, ఫోరెన్సిక్ నివేదికలతోపాటు ఇతర సాక్ష్యాలను జతచేసి అభియోగ పత్రాన్ని పోక్సో కోర్టులో సమర్పించారు. న్యాయ విచారణలో 24 మంది సాక్షుల వాంగ్మూలాలు కోర్టు నమోదు చేసింది. వివిధ సెక్షన్ల కింద గోవింద్రావుపై నేరం రుజువైనట్లు నిర్ధారిస్తూ అత్యాచారం నేరానికిగాను జీవిత ఖైదు, దాడి చేసి బాధితురాలి మృతికి కారణమైనందున హత్యా నేరానికిగాను మరో జీవితఖైదును జడ్జి విధించారు. రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. బాలిక కుటుంబానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ తరఫున రూ. 5 లక్షల పరిహారం అందించాలని సెషన్స్ జడ్జి సునీత తీర్పులో సూచించారు. -
టీడీపీలో యూజ్ అండ్ త్రో పాలసీ..! అచ్చెన్న వ్యాఖ్యలు నిజమే?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : తెలుగుదేశం పార్టీలో యూజ్ అండ్ త్రో పాలసీ మరోసారి తెరపైకి వచ్చింది. పాతపట్నం టీడీపీలో ‘చేతిచమురు’తో క్రియాశీలకంగా వ్యవహరించిన మామిడి గోవిందరావు విషయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు గతంలో చేసిన వ్యాఖ్యలే నిజమయ్యాయి. పార్టీ కోసం ఎంత ఖర్చు పెడుతున్నా కూరలో కరివేపాకు మాదిరిగానే వాడుకుంటున్నట్టు మరోసారి స్పష్టమైంది. మామిడి వెంట తిరుగుతున్న వారిపై వేధింపులు ప్రారంభించి.. తనను కాదని వెళ్లితే టార్గెట్ చేయక తప్పదని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి కలమట వెంకటరమణ తన చేతల ద్వారా చూపిస్తున్నారు. అధినేతలు తన మాటకే విలువ ఇస్తారని టీడీపీ కేడర్‌కు సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పుడీ వ్యవహారం పాతపట్నం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. కేడర్‌కు వేధింపులు.. టీడీపీలో డబుల్ గేమ్ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మరో నేత మామిడి గోవిందరావు మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్ వస్తుందనే విధంగా గోవిందరావు దూకుడుగా వెళ్తున్నారు. టీడీపీలో ఉన్న అరకొర కేడర్‌ను నయానో భయానో తనవైపు తిప్పుకుంటున్నారు. దీంతో అక్కడ పార్టీ ఇన్చార్జిగా ఉన్న కలమట వెంకటరమణ ఉనికి తగ్గింది. అటు లోకేష్‌ను, ఇటు చంద్రబాబును తరుచూ కలుస్తూ, వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వదులుతూ గోవిందరావు హడావుడి చేస్తున్నారు. అధిష్టానం వద్దే మామిడికే ప్రాధాన్యత ఉందని టీడీపీలో ఉన్న కార్యకర్తలు ఒక్కొక్కరిగా మామిడి వైపు వస్తున్నారు. ఈ పరిణామాలను గమనించిన కలమట ..ఇంకా వదిలేస్తే తన అస్థిత్వానికే ముప్పుతప్పదని గ్రహించి యాక్షన్‌లోకి దిగారు. కేడర్ చేజారిపోకుండా జాగ్రత్తపడ్డారు. తన నుంచి వెళ్తున్న నాయకులు, కార్యకర్తలపై వేధింపులు మొదలు పెట్టారు. పార్టీ పదవులుండి.. మామిడి వెంట వెళ్తున్న నాయకులపై వేటు వేయిస్తున్నారు. దానికొక ఉదాహరణగా ఎల్‌ఎన్‌పేట పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వెలమల గోవిందరావు తాజాగా మామిడి గోవిందరావు వెంట వెళ్లడంతో ఆయన పదవిని తొలగించారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు, కూన రవికుమార్లకు చెప్పి హుటాహుటీన వెలమల గోవిందరావుకు ఉన్న మండల పార్టీ అధ్యక్ష పదవిని మెండ మనోహార్ అనే వ్యక్తికి కట్టబెట్టారు. దీంతో మామిడి వెంట ఉన్న వెలమల గోవిందరావు మరికొందరు నాయకులు ఎదురుదాడి చేసి కలమటపై ఆరోపణలు చేసినా అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఇదంతా చూస్తుంటే నిమ్మాడలో అచ్చెన్నాయుడు చెప్పినట్టు మామిడి గోవిందరావును వాడుకోవడానికే తప్ప అంతకుమించి ఏమీ లేదన్న వ్యాఖ్యల్ని నిజం చేస్తున్నట్టుగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ రోజు..మామిడి గోవిందరావుకు టికెట్ ఇచ్చే ఆలోచన లేదని.. కలలో కూడా ఊహించొద్దని...నీ కోసం వాడుకోవడానికే ఉపయోగిస్తున్నానని.. పార్టీ కోసం డబ్బులిస్తున్నాడు.. తరుచూ చెక్‌లు తీసుకొచ్చి ఇస్తున్నాడు.. చెక్ కాదు కదా ఆస్తి రాసిచ్చినా పార్టీకి వాడుకుంటాం.. వాడుకోవాలన్నదే నా ఉద్దేశమని కలమట వెంకటరమణకు అచ్చెన్నాయుడు చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయనిపిస్తోంది. మామిడి గోవిందరావు ఎంత ఖర్చు పెట్టినా, ఎవరి వద్దకు తిరిగినా మా మద్దతు నీకే అన్నట్టుగా కలమటకు అనుకూలంగా అధినేతలంతా వ్యవహరిస్తున్నారు. దీంతో పారీ్టలో అంతర్గత పోరు మరింత ఎక్కువైనట్లయ్యింది. -
రెవెన్యూ అధికారులకు నోటీసులు
తెర్లాం రూరల్ : సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం సకాలంలో సక్రమంగా ఇవ్వనందున తెర్లాం తహశీల్దార్ యు.రాజకుమారికి, పార్వతీపురం ఆర్డీఓ ఆర్.గోవిందరావుకు సమాచార హక్కు చట్టం కమిషనర్ నుంచి నోటీసులు అందాయని ఫిర్యాదుదారుడు కె.ధనప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పెరుమాళి గ్రామానికి చెందిన సర్వే నంబర్ 29లో గల యర్ర చెరువులోని అక్రమణదారుల వివరాలు కావాలని కోరగా, సరైన వివరాలు అందివ్వలేదన్నారు. దీంతో తాను సమాచార హక్కు చట్టం కమిషనర్‌కు ఫిర్యాదు చేశానన్నారు. దీంతో ఆయన ఈ నెల 29న జెడ్పీ సమావేశ మందిరంలో చేపట్టననున్న విచారణకు హాజరుకావాలని తనతో పాటు తహశీల్దార్, ఆర్డీఓలకు నోటీసులు పంపించారని చెప్పారు. -
మరణంలోనూ వీడని బంధం..
కరీంనగర్ : మూడుముళ్లు... ఏడుడగుల బంధంతో ఏకమైన దంపతులు కడదాకా కలిసే పయనించారు. అనారోగ్యంతో మంచం పట్టిన భర్త.. గుండెపోటుతో చికిత్స పొందుతున్న భార్య.. ఇద్దరూ కొన్ని గంటల తేడాలో మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన గండ్ర గోవిందరావు(95), సత్తమ్మ (85) దంపతులు. గోవిందరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భర్తకు సేవచేస్తూ అతనికి తోడుగా ఉన్న సత్తమ్మ వారంరోజుల క్రితం గుండెపోటుకు గురైంది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈక్రమంలో గోవిందరావు శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఆయన మరణించిన కొద్ది గంటల్లో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న సత్తమ్మ కూడా కన్నుమూశారు. భార్యాభర్తలు ఇద్దరు ఒకేరోజు మృతిచెందడంతో బంధువులు, కుటుంబసభ్యులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. సత్తమ్మ మృతదేహాన్ని కోరుట్లపేటకు తీసుకువచ్చి దంపతులిద్దరినీ ఒకే చితిపైన ఉంచి అంత్యక్రియలు జరిపారు. -
సమస్యలపై తోటపల్లి నిర్వాసితుల నిరసన
విజయనగరం జిల్లా తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం పార్వతీపురం ఆర్డీవో గోవిందరావును కలసి వినతిపత్రం ఇచ్చారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తానని ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, దానిపై ఇప్పటి వరకూ చర్యల్లేవన్నారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
'ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం విడుదల చేయాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 18 నెలల కాలంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీ నిరుద్యోగ ఐక్యవేదిక అధ్యక్షుడు లగుడు గోవిందరావు డిమాండ్ చేశారు. ఏపీలో ఖాళీగా ఉన్న లక్ష 48 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఇంటికో ఉద్యోగం హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబు అధికారం చేపట్టి 18 నెలలు అయిన ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని గోవిందరావు ఆరోపించారు. దీనికి నిరసనగా బుధవారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు బిక్షాటన, గురువారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. -
భవిష్యత్ వైఎస్సార్సీపీదే..
గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీ విజయం ఖాయమని పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు, విశాఖ జిల్లా ప్రచార కమిటీ పరిశీలకుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. కొండవాడ పంచాయతీ వత్తాడ గ్రామానికి చెందిన 80 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. ఈ సందర్భంగా గ్రామంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు కనుమరుగవుతాయని చెప్పారు. కాంగ్రెస్ పాలకులు ప్రజా సమస్యలను గాలికొదిలేశారని ఆరోపించారు. అనంతరం గ్రామానికి చెందిన బిడ్డిక గయారి, బిడ్డిక కుమారి, బిడ్డిక సోమమ్మ, తాడంగి ఆవిటమ్మ, మాలతమ్మ, ఈరమ్మ, గంటా జయంతి, నిమ్మక రాసమ్మ, గోవిందరావు, రాజు, బిడ్డిక సీతయ్య, తాడంగి కొండలరావు, పత్తిక సూర్యనారాయణ, శ్రీనివాస్, తదితరులకు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పత్తిక లక్ష్ముయ్య, నిమ్మక గోపాల్, రెల్ల సర్పంచ్ కుంబురిక దీనమయ్య, పి.లేవిడి సర్పంచ్ పత్తిక ఇందిర, వత్తాగ సర్పంచ్ తాడంగి రాద, తాడంగి రాజు, జి.సత్యవతి, కడ్రక జంగం మాస్టారు, శేషాపాత్రుడు, నిమ్మక జేసురాజు, తదితరులు పాల్గొన్నారు. 30 కుటుంబాల చేరిక కొత్తూరు(కొత్తవలస) : కొత్తూరుగొప్పు హరిజన కాలనీకి చెందిన 30 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. వీరందరికీ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బోకం శ్రీనివాస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోకం శ్రీనివాస్ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలు సుఖంగా ఉండాలంటే జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలోకి తొక్కుతోందని ఆరోపించారు. రానున్న రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. పార్టీలో చేరిన కె.గురువులు, కె.దేముడు, కె.బంగారయ్య, బి.కన్నమ్మ, బి.సత్యవతి, ఆర్.కొండమ్మ, తదితరులు మాట్లాడుతూ, రాజశేఖరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఆయన రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే పార్టీలోకి చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వై.మాధవరావు, చీడివలస సర్పంచ్ మేడపురెడ్డి ఈశ్వరరావు(శంకర్), అడిగర్ల సంతోష్, నంబారు కిరణ్, బాలకృష్ణ, పెదిరెడ్ల శ్రీనివాసరావు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.