విజయనగరం జిల్లా తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం పార్వతీపురం ఆర్డీవో గోవిందరావును కలసి వినతిపత్రం ఇచ్చారు.
విజయనగరం జిల్లా తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం పార్వతీపురం ఆర్డీవో గోవిందరావును కలసి వినతిపత్రం ఇచ్చారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తానని ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, దానిపై ఇప్పటి వరకూ చర్యల్లేవన్నారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.