భవిష్యత్తు వైఎస్‌ఆర్‌సీపీదే | Future YSR CP :-Chintala Ramachandrareddy | Sakshi
Sakshi News home page

భవిష్యత్తు వైఎస్‌ఆర్‌సీపీదే

Published Thu, Apr 28 2016 4:51 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

భవిష్యత్తు   వైఎస్‌ఆర్‌సీపీదే - Sakshi

భవిష్యత్తు వైఎస్‌ఆర్‌సీపీదే

 పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
 
కలకడ : రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న పార్టీ ఒక్క వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మాత్రమేనని పీలేరు శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం కలకడలో ఆ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అధికార తెలుగుదేశం పార్టీలోకి వలస వెళుతున్న వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదన్నారు. సైకిల్ గుర్తుపై విజయం సాధిం చినవారు సైతం అధికారం కోసమే పార్టీని అంటుపెట్టుకుని ఉన్నారన్నారు. టీడీపీ నాయకులు చాలామందిలో తమ పార్టీలో నిజాయితీ లోపిందనే భావన నెలకొందన్నారు. ఒక గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన వారిని ప్రజలు అస్యహించుకుంటారని గుర్తు చేశారు.

పంచాయతీలోని వార్డు సబ్యుడి నుంచి, పార్లమెంటు సభ్యుల వరకూ నిబద్ధత  నిండి ఉండాలన్నారు. తిరిగి ఎన్నికల్లో రాణించలేం అనుకునే వారే తాత్కాలిక ప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్నారని తెలిపారు. వైఎస్‌ఆర్ సీపీలో ఉన్న వారికే మంచి భవిష్యత్తు ఉంటుం దని స్పష్టం చేశారు.


 హామీల అమలెక్కడ?
 రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని ఎమ్మెల్యే చింతల ధ్వజమెత్తారు. అందుకే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్తుత్తి హామీలు ఇవ్వలేకనే సాధ్యంకాని వాటి జోలికి వెళ్లలేదన్నారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు సైతం అభివృద్ధి నిధులు లేక ప్రజలకు ఎలాంటి హామీలూ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు వంగిమళ్ల మధుసూదన్‌రెడ్డి, కలకడ  కన్వీనర్ బి.వెంకట్రమణరెడ్డి, (బాబురెడ్డి), మాజీ సర్పంచ్ గుర్రప్ప, కమలాకర్‌రెడ్డి, నీళ్ల భాస్కర్, షావత్‌అల్లీ, జిలానీ, కస్మూరిట్రేడర్స్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement