Chintala Ramachandrareddy
-
‘నల్లారి కిశోర్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలి’
సాక్షి, చిత్తూరు: రాష్ట్రంలో టీడీపీ నాయకుల అరాచకాలను నిలదీసేందుకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం చిత్తూరు జిల్లాలోని కలికిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... పీలేరు నియోజకవర్గంలో టీడీపీ నేత నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి అరాచకాలు పెరిగిపోయాయని, ఆయనకు బుద్ధి చెప్పాలంటే.. అందుకు సరైన ఆయుధం ప్రజల చేతిలోనే ఉందని, ప్రజలు ఓటుతో ఆయనకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజలను ఎప్పుడు ఇబ్బంది పెట్టేవారు ప్రజాప్రతినిధులు అయితే పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. టీడీపీ నేతలు అధికారదర్పం ప్రదర్శిస్తూ కలికిరి మండలం పత్తేగడ పంచాయతీ బాలయ్యకుంట గ్రామస్తులకు నరకం చూపిస్తున్నారని, గ్రామస్తులు వైఎస్సార్సీపీలో చేరవద్దంటూ కిశోర్‌కుమార్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ సభలో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి, ఇక్బాల్ అహమ్మద్, కారపకుల భాస్కర్ నాయుడు, నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
జీవన్‌రెడ్డి మైక్ లాగేసిన చింతల
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ సమస్యపై చలో అసెంబ్లీ చేపట్టిన బీజేవైఎం కార్యకర్తల అరెస్టులు, నిరుద్యోగుల అంశాలపై చర్చ కోసం బీజేపీ పట్టుబట్టడంతో మంగళవారం శాసనసభ కొంతసేపు అట్టుడికింది. వాయిదా తీర్మానంపై చర్చించాలన్న డిమాం డ్‌ను స్పీకర్ తిరస్కరించి, ప్రశోత్తరాలను ప్రారంభించడంతో బీజేపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. స్పీకర్ అనుమతితో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి మైకును బీజేపీ సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి లాగేశారు. సభ మొదలుకాగానే.. సభ మొదలవుతూనే.. నిరుద్యోగుల సమస్యపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలంటూ బీజేపీపక్ష నేత కిషన్‌రెడ్డి పట్టుబట్టారు. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టిన బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని ప్రస్తావించారు. అయితే ఈ విజ్ఞప్తిని తిరస్కరించిన స్పీకర్.. ప్రశ్నోత్తరాలు ముగిశాక చర్చిద్దామని సూచించారు. స్పీకర్ అవకాశమివ్వడంతో వ్యవసాయోత్పత్తులకు మద్దతు ధర అంశంపై కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి మాట్లాడడం ప్రారంభించారు. దీంతో కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి, బీజేపీ సభ్యుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో జీవన్‌రెడ్డి మైకును పక్కనే నిలబడి ఉన్న బీజేపీ సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి లాగేశారు. దీన్ని స్పీకర్, కాంగ్రెస్ సభ్యులు తప్పుబట్టారు. సీఎం సూచన మేరకు వెనక్కి తగ్గినా.. కాసేపటికి సభలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాల్సిం దిగా బీజేపీ సభ్యులను కోరారు. సమస్యలపై ప్రభుత్వ దృష్టి పడేందుకు చలో అసెంబ్లీ నిర్వహిస్తారని, తప్పేంలేదన్నారు. కానీ అంగన్వాడీ వర్కర్ల ఆందోళన హింసాత్మ కంగా మారిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలపై నిషేధాజ్ఞలు విధించాల్సి వస్తోందని, అందులో భాగంగా అరెస్టులు జరుగుతాయని, దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని సూచించారు. దాంతో బీజేపీ సభ్యులు వెళ్లి వారి సీట్లలో కూర్చున్నారు. ఆ వెంటనే స్పీకర్ తిరిగి ప్రశ్నోత్తరాలను ప్రారంభించడంతో.. బీజేపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో కిషన్‌రెడ్డికి మాట్లాడే అవకాశమిచ్చారు. యువతలో ఉద్యోగాల కల్పనపై తీవ్ర ఆందోళన ఉందని, దాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే బీజేవైఎం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తాము కూడా అందుకే వాయిదా తీర్మానం కోరామని, ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని ప్రకటించి.. బయటికి వెళ్లిపోయారు. సీఎం ఏం చేస్తున్నారు: అక్బరుద్దీన్ బీజేపీ సభ్యులు వాకౌట్ చేయగానే మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ మాట్లాడారు. జీవన్‌రెడ్డి మైకును బీజేపీ సభ్యుడు లాగిన తీరుపై సీఎంగానీ, స్పీకర్‌గానీ సరిగా స్పందించలేదని తప్పుబట్టారు. కనీసం విచారం వ్యక్తం చేయాల్సిందిగా కూడా కిషన్‌రెడ్డిని కోరక పోవడం దారుణమని వ్యాఖ్యానించారు. సభ ఆర్డర్లో లేనప్పుడు ప్రశ్నోత్తరాలు ఎలా కొనసాగిస్తారని, కనీసం వాయిదా వేసి ఉండాల్సిందని.. ఇలా సంప్రదాయాలు లేని సభలో తాను ఉండటం సరికాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చివరికి ఈ వాదనపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. చిన్నచిన్న అంశాలను వివాదాస్పదం చేయడం సరికాదన్నారు. -
రైతు సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేద ని, దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేపీ శాసన సభాపక్షం బుధవారం భేటీ అయ్యింది. అనంతరం ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలసి చింతల విలేకరులతో మాట్లాడారు. బాబు జగ్జీవన్‌రాం విగ్రహం నుంచి అసెంబ్లీకి పాదయాత్రగా వస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వోద్యోగాల భర్తీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలే దన్నారు. బీజేపీ కార్యకర్తలపై నమోదు చేసిన అక్రమ కేసులపై సభలో నిలదీస్తా మన్నారు. గురువారం టీటీడీపీ, బీజేపీ ఫ్లోర్ కోఆర్డినేషన్ కోసం సమావేశామవు తున్నట్లు, తమ పార్టీ నుంచి బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావులు పాల్గొంటారని చింతల చెప్పారు. వర్షాల వల్ల నష్టపోయిన పత్తి, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలన్నారు. -
భవిష్యత్తు వైఎస్ఆర్సీపీదే
పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కలకడ : రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమేనని పీలేరు శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం కలకడలో ఆ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అధికార తెలుగుదేశం పార్టీలోకి వలస వెళుతున్న వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదన్నారు. సైకిల్ గుర్తుపై విజయం సాధిం చినవారు సైతం అధికారం కోసమే పార్టీని అంటుపెట్టుకుని ఉన్నారన్నారు. టీడీపీ నాయకులు చాలామందిలో తమ పార్టీలో నిజాయితీ లోపిందనే భావన నెలకొందన్నారు. ఒక గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన వారిని ప్రజలు అస్యహించుకుంటారని గుర్తు చేశారు. పంచాయతీలోని వార్డు సబ్యుడి నుంచి, పార్లమెంటు సభ్యుల వరకూ నిబద్ధత నిండి ఉండాలన్నారు. తిరిగి ఎన్నికల్లో రాణించలేం అనుకునే వారే తాత్కాలిక ప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్నారని తెలిపారు. వైఎస్ఆర్ సీపీలో ఉన్న వారికే మంచి భవిష్యత్తు ఉంటుం దని స్పష్టం చేశారు. హామీల అమలెక్కడ? రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని ఎమ్మెల్యే చింతల ధ్వజమెత్తారు. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తుత్తి హామీలు ఇవ్వలేకనే సాధ్యంకాని వాటి జోలికి వెళ్లలేదన్నారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు సైతం అభివృద్ధి నిధులు లేక ప్రజలకు ఎలాంటి హామీలూ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వంగిమళ్ల మధుసూదన్‌రెడ్డి, కలకడ కన్వీనర్ బి.వెంకట్రమణరెడ్డి, (బాబురెడ్డి), మాజీ సర్పంచ్ గుర్రప్ప, కమలాకర్‌రెడ్డి, నీళ్ల భాస్కర్, షావత్‌అల్లీ, జిలానీ, కస్మూరిట్రేడర్స్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.