అనంతపురం స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : ‘‘ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి’’ - ఎక్కడ క్రీడాపోటీలు జరిగినా మన ప్రజాప్రతినిధులు చెప్పే మాటలివి. కానీ క్షేత్రస్థాయిలో విద్యార్థులు ఆడుకోలేకపోతున్నారు. పాఠశాలల్లో క్రీడామైదానాలు లేకపోవడమే ఇందుకు కారణం. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాల్లో క్రీడలు నామమాత్రంగానే సాగుతున్నాయి. జిల్లాలో 3178 ప్రాథమిక పాఠశాలలు, 938 ప్రాథమికోన్నత పాఠశాలలు, 909 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 80 శాతం పాఠశాలల్లో మైదానాలు లేకపోవడం గమనార్హం. ఒక్క ప్రాథమిక పాఠశాలలో కూడా మైదానాలు లేవు. 70 యూపీ స్కూళ్లలో, వందలోపు హైస్కూళ్లలో మైదానాలు ఉన్నాయి. ఇక పీఈటీలు జిల్లా వ్యాప్తంగా 491 మంది మాత్రమే ఉన్నారు. వీరు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మైదానాలు లేకపోవడంతో క్రీడలు కూడా నామమాత్రంగానే సాగుతున్నాయి. చాలా పాఠశాలల్లో డ్రిల్ పిరియడ్ అమలు కావడం లేదు. విద్యార్థులు స్కూల్ అయిపోయిన వెంటనే ఇళ్లకు పరుగులు తీస్తున్నారు.
ప్రైవేట్ స్కూళ్లలో కన్పించని మైదానాలు
జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో మైదానాలు మచ్చుకైనా కన్పించడం లేదు. కార్పొరేట్ పాఠశాలల్లో అవకాశం ఉన్నా...ఇక మిగితా హై స్కూళ్లలో ఆ పరిస్థితి కన్పించదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులు పుస్తకాలతోనే మగ్గిపోతున్నారు. ఇదేమిటని అడిగితే తల్లిదండ్రులకు ఇష్టం లేదని అందుకే చదువుకే ప్రాధాన్యత ఇస్తున్నామని యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూళ్లకి మైదానాలతో పాటు ఓ పిరియడ్ క్రీడలుండాలి. అయితే అటువంటి దాఖలాలు కన్పించడం లేదు. విద్యార్థులు నాలుగు గోడల మధ్యే ఉంటూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఒత్తిడికి గురవుతున్నారు.
ఆటకు.. టాటా!
Published Sat, Dec 28 2013 3:02 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement