గణేష్ ఉత్సవాల్లో వివాదం
Published Thu, Sep 19 2013 3:08 AM | Last Updated on Tue, Mar 19 2019 9:15 PM
అమలాపురం రూరల్, న్యూస్‌లైన్ : అమలాపురం కూరగాయల మార్కెట్ వినాయక చవితి ఉత్సవాల్లో మంగళవారం అర్ధరాత్రి రెండువర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదం కొట్లాటకు దారితీసింది. ఒకదశలో ఇరువర్గాల వారు వీధుల్లో మారణాయుధాలతో స్వైరవిహారం చేశారు. అర్ధరాత్రి సమయంలోనే ఓ వర్గం ధర్నాకు దిగితే, అదే వర్గం బుధవారం ఉదయం రాస్తారోకోకు దిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్కెట్ వీధిలోని గణపతి పందిరిలో మంగళవారం రాత్రి డ్యాన్స్‌బేబీడ్యాన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఆ ప్రోగ్రాంలో ఒక హీరో అభిమానులు అతడి సిని మా పాటలు వేయాలని పట్టుబట్టారు. దీనికి నిర్వాహకులు అంగీకరించకపోవడంతో వివాదం తలెత్తింది. మాటామాటా పెరిగి ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. ఇరు వర్గాలకు చెందిన కొందరు యువకులు కత్తులతో వీరం గం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేయడంతో.. అల్లరి మూకలు చెదిరిపోయాయి. ఓ వర్గం వారు తమపై మార్కెట్‌కు చెం దిన కొందరు వ్యక్తులు దాడి చేశారని ఆందోళనకు దిగారు.
పట్టణ ఎస్సై ఆర్.అంకబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి, పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. ఆ ప్రాంతంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. బుధవారం ఉద యం ఇరువర్గాల వారు తమపై దాడు లు చేశారంటూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఇలాఉండగా మున్సిపల్ కాలనీకి చెందిన ప్రజలు మార్కెట్ ప్రాంతానికి చెందిన కొంద రు తమను కులంపేరుతో దూషించారంటూ వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ గంపల సత్యప్రసాద్, మెండు రమేష్‌బాబు, బండారు సత్యనారాయణ, మిరియాల వెంకట్రావు ఆధ్వర్యంలో స్థానిక బుద్ధవిహార్ వద్ద బుధవారం ఉదయం రాస్తారోకో చేశారు. దాదాపు గంటన్నరపాటు ఆందోళన కొనసాగింది. సంఘటన స్థలానికి డీఎస్పీ కె.రఘు,
సీఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి, సర్కిల్‌లోని ఎస్సైలు ఆనంద్‌కుమార్, భీమరాజు, కె.విజయ్‌బాబులు చేరుకుని పరిస్థితి సమీక్షిం చారు. తమపైదాడి చేసినవారిని అరె స్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆం దోళనకారులు డిమాండ్ చేశారు. విచారణ చేపట్టి నిందితులపై కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మార్కెట్ సెంటర్ వర్గీయులు తమ ఇళ్లకు వచ్చి మారణాయుధాలతో దాడిచేసి కులంపేరుతో దూషించారని, ఈ దాడిలో అమలుదాసు చిన్న, కానేటి నాగేంద్ర, దువ్వా చిన్న గాయపడ్డారని అమలుదాసు సతీష్, మొగలి దుర్గాప్రసాద్, నక్కా నరసింహమూర్తిలు ఫిర్యా దు చేసినట్టు ఎస్సై ఆర్.అంకబాబు తెలిపారు. మార్కెట్‌లో పంది రిలోకి వచ్చి అల్లర్లు సృష్టించి, తమపై దాడిచేశారని మార్కెట్‌కు చెందిన కొంత మంది, ఉత్సవ కమిటీ నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement