బీజేపీ బలాబలాల్ని బట్టి వ్యవహరించాలి: గంటా
విశాఖపట్నం: సీట్ల సర్దుబాటుపై బీజేపీ బలాబలాల్ని బట్టి వ్యవహరించాలని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సీట్ల సర్దుబాటు విషయంలో బీజేపీ పట్టువిడుపులు చూపాలని గంటా సూచించారు.
సీట్ల సర్దుబాటులో టికెట్లు లభించని బీజేపీ అభ్యర్థులకు మరో రకంగా టీడీపీ సాయపడుతుందని గంటా అన్నారు. గురువారం 90 శాతం సీమాంధ్ర టీడీపీ అభ్యర్థుల ప్రకటిస్తామని గంటా తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ టికెట్ పై గెలిచి, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా సేవలందించిన గంటా శ్రీనివాసరావు ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.