విశాఖ ఇమేజ్‌ను దెబ్బతీసే యత్నం: గంటా
విశాఖ కేంద్రంగా జరిగిన భూ కుంభకోణంపై మంత్రి గంటా శ్రీనివాస్‌రావు స్పందించారు.
విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా జరిగిన భూ కుంభకోణంపై మంత్రి గంటా శ్రీనివాస్‌రావు స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ' విశాఖకు ఉన్న ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి నేరుగా స్పందించారు. రెవెన్యూ మంత్రి ఇక్కడకు వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుంభకోణాన్ని అధికార పార్టీ సభ్యులమే బయటపెట్టాము. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నవారిని ఎవర్ని వదిలిపెట్టం. ఎంత పెద్ద వారైనా ఉపేక్షించేది లేదు' అన్నారు. శంకర్రావు ఆస్తుల పై ఏసీబీ దాడులకు, భూకుంభకోణానికి ఎలాంటి సంబంధం లేదని.. ఏసీబీ తన పని చేస్తోందని అన్నారు.