ఒంగోలు టూటౌన్ : జిల్లా గజిటెడ్ అధికారుల అసోసియేషన్ సమస్యలను ఈ నెల 12న సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు అసోసియేషన్ జిల్లా చైర్మన్ షేక్ అబ్దుల్ బషీర్ చెప్పారు. అసోసియేషన్ స్థానిక కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గజిటెడ్ అధికారుల సంఘం ఆవశ్యకత, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ నెల 12న విజయవాడలోని లయోల కళాశాలలో సీఎంను కలిసి వివరించనున్నట్లు తెలిపారు.
అనంతరం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సీఎంను సన్మానిస్తామన్నారు. సంఘ కన్వీనర్ వీజీకే ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ నాయకులు అశోక్‌బాబు నాయకత్వంలో విజయవాడలో జరిగే సమావేశానికి అందరూ హాజరు కావాలని కోరారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ఉద్యోగులందరూ తమ సేవలందించే విషయంలో ముందుంటారని సంఘ కో-చైర్మన్ కె.రాజ్ కుమార్ తెలిపారు.
సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడుప్రసాద్‌కు ఘన సన్మానం
రాష్ర్ట గజిటెడ్ అధికారుల సంఘ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వీజీకే ప్రసాద్‌ను అసోసియేషన్ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు కే రాజ్‌కుమార్, జీఆర్ రాజశేఖర్, డాక్టర్ వెంకయ్య, కే కృపారావు, వై ధనలక్ష్మి, హసీనాబేగం, చిత్తరంజన్ శర్మ, సీహెచ్ పద్మజ, వై వెంకట్రావు, సీఐ వెలమూరి శ్రీరామ్, డాక్టర్ వెంకటసుబ్బయ్య, కే నాగేశ్వరరావు, సిటీ యూనిట్ ప్రతినిధులు ప్రసాద్, పున్నారావు, కృష్ణారావు పాల్గొన్నారు.
సీఎం దృష్టికి జిల్లా గజిటెడ్ అధికారుల సమస్యలు
Published Thu, Jul 10 2014 3:45 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement