విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: లోక్‌సభ, శాసనసభల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 12న విడుదల చేస్తున్నట్టు కలెక్ట ర్ కాంతిలాల్ దండే తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుంచి ఐదు రోజులపాటు నామినేషన్ల్లు స్వీకరిస్తామన్నారు.
నామినేషన్‌తో పాటు అఫిడవిట్ సమర్పించాలన్నారు. ఎంపీ అభ్యర్థి రూ.25 వేలు, ఎమ్మెల్యే అభ్యర్థి రూ.10 వేలు డిపాజిట్ చేయూల్సి ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో సగమే చెల్లించాలన్నారు. నామినేషన్‌కు ముందురోజు ప్రత్యేక బ్యాంకు ఖాతా ప్రారంభించి ఎన్నికల వ్యయాన్ని ఆ ఖాతా ద్వారా ఖర్చు చేయాలన్నా రు. మే 5లోగా ప్రచారం పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు.
ఇప్పటివరకూ 49 రకాల కోడ్ ఉల్లంఘనలు జరిగాయన్నారు. ఎక్కడైనా కోడ్ ఉల్లంఘ న జరిగితే 1070 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి సమాచారమందించవచ్చని తెలిపారు. ర్యాలీలు, సమావేశాల కు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. ఈ నెల 24 నుంచి నెలాఖరు వరకూ ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తామని పేర్కొన్నా రు.
ఓటరు స్లిప్పుల పంపిణీపై అభ్యంతరాలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఓటరు స్లిప్పు లు లేనంత మాత్రాన ఓటింగ్‌కు అనుమతించకూడదనే నిబంధన లేదన్నారు. ఎన్నికల సంఘం గుర్తించిన 21 గుర్తింపు కార్డులకు అదనంగా ఈ స్లిప్పులను ఎన్నికల సంఘం గుర్తించిందన్నారు.
రాజకీయ నాయకులు కూడా ఓటరు స్లిప్పులు ఇవ్వవచ్చన్నారు. పార్టీ అభ్యర్థి, చిహ్నం, గుర్తులు, జెండాల వంటివి ముద్రించకూడదన్నారు. పోలింగ్ రోజున పార్టీ ల గుర్తులు, జెండాలు కనిపించకూడదని స్పష్టం చేశా రు. సమావేశంలో జేసీ రామారావు, ఏజేసీ నాగేశ్వరరా వు, డీఆర్వో హేమసుందర్, జెడ్పీ సీఈఓ మోహనరా వు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
‘సార్వత్రిక’ నోటిఫికేషన్ రేపు
Published Fri, Apr 11 2014 4:47 AM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM
Advertisement