ఉత్సాహంగా అ‘పూర్వ’ కలయిక | get gother party | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా అ‘పూర్వ’ కలయిక

Published Sun, Feb 16 2014 12:47 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

ఉత్సాహంగా అ‘పూర్వ’ కలయిక - Sakshi

ఉత్సాహంగా అ‘పూర్వ’ కలయిక

ఉత్సాహంగా అ‘పూర్వ’ కలయిక
 మాజేరు(చల్లపల్లి రూరల్),  : వెలకట్టలేని ఈ ఆపూర్వ కలయిక ఎంతో మధురమైనదని దీనిని అందరూ కొనసాగించాలని రిటైర్డ్ ఉపాధ్యాయుడు బి.దిండినాధరావు సూచించారు. చల్లపల్లి మండలం, కొత్తమాజేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ 10వ తరగతి(1988-89) విద్యార్ధినీ, విద్యార్ధుల ఆత్మీయ కలయికను శనివారం సాయంత్రం పాఠశాలలో నిర్వహించారు.  ఇక్కడ చదివి గుజరాత్, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, కాకినాడలో వృత్తివ్యాపారాల్లో స్థిరపడిన వారు తరలివచ్చారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకుని సంతోషంగా గడిపారు. గురువులను ఘనంగా సన్మానించుకున్నారు. పూర్వ విద్యార్థులు ఎం.కొండలరావు, పి.సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో సర్పంచి మాచవరపు సునీత, మాజీ సర్పంచి యార్లగడ్డ రామలింగయ్య, ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయలు, పూర్వ విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement