
ఆందోళనకు సిద్ధంకండి
ఏపీ ఎన్‌జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు
అశోక్‌బాబు పిలుపు
తిరుపతి కార్పొరేషన్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు అసరమైతే సమైక్యాంధ్ర ఉద్యమ తరహాలో ఆందోళనకు సిద్ధం కావాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తిరుపతి శాఖ వార్షిక సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహిం చారు. తిరుపతిలో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు టీటీడీలో కల్పించే సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకుం టామన్నారు. ముఖ్యంగా గుర్తింపు కార్డులు, దర్శన విషయాలు టీటీడీ ఈవోతో చర్చిస్తామన్నారు. ఉద్యోగులకు ఇంటి స్థలాలు కల్పించడం,ఎన్‌జీవోలకు తిరుపతిలో కల్యాణ మండపం నిర్మించేలా ముఖ్యమంత్రి తో చర్చిస్తామని తెలిపారు.
అంతకు ముందు ఏపీ మెడికల్ హెల్త్ మినిస్టీరియల్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నయనార్ వరప్రసాద్ మాట్లాడు తూ సిపీఎస్ పెన్షన్ స్కీమ్‌లో రుణ సౌకర్యం కల్పించాలన్నారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర, జిల్లా నాయకులు ప్రభాకర్ నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, శివారెడ్డి, విజయలక్ష్మీ, దేవప్రసాద్, ప్రసన్నరాణి, కుసుమ, గురుకుమార్, సురేష్, మునస్వామి, కోటీశ్వర్‌రావు, జమాల్ వల్లీ, ఎన్‌సీసీ గుణశేఖర్, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.