గుంటూరు మెడికల్: కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి ఉరివేసుకుని చనిపోతూ తన బిడ్డలను సైతం ఉరివేసి చంపాలనుకుంది. చుట్టుపక్కల వారు గమనించే సరికి తల్లి ఓ బిడ్డ చనిపోగా మరో పాప మాత్రం ఉరితాడుకు వేలాడుతూనే శ్వాస తీసుకోవటాన్ని గమనించారు. కొన ఊపిరిలో ఆస్పత్రికి వచ్చిన పాపకు గుంటూరు జీజీహెచ్ పిల్లల వైద్య విభాగం వైద్యులు మెరుగైన వైద్యసేవలను అందించి ప్రాణాలు కాపాడారు. పాప ఆరోగ్యం మెరగవ్వటంతో శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
ఈ మేరకు శుక్రవారం పిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ ఎంఎస్ రాజు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. మే 18వ తేదీన పూసపాటి హేమశ్రీ అనే రెండున్నరేళ్ల చిన్నారిని బంధువులు తమ వద్దకు తీసుకొచ్చారని డాక్టర్ రాజు చెప్పారు. తల, మెడ భాగాల్లో వాపు ప్రారంభమై శ్వాసకి ఇబ్బంది పెరిగిందన్నారు. పాపకు ‘ట్రమటిక్ సర్వైకల్ వ్యాస్కులోపతి విత్ మైలోపతి ’వ్యాధిగా నిర్ధారణ చేసి 20 రోజులు పాటు ప్రత్యేక పర్యవేక్షణలో వైద్యసేవలను అందించటంతో ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. డాక్టర్ బి.దేవకుమార్, డాక్టర్ పేరం ఝాన్సీ, డాక్టర్ కరిముల్లా, డాక్టర్ వాణిభాయ్, డాక్టర్ మీన ఇతర స్పెషాలిటీ వైద్యులు 28 రోజులపాటు వైద్యం అందించినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment