సాక్షి, రెంటచింతల (మాచర్ల): పదమూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి బలవంతంగా వివాహం జరిపించిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాలిక తల్లి పాతూరి పార్వతి, ఎస్‌ఐ వై.కోటేశ్వరరావు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం పాలువాయి గేటు గ్రామానికి చెందిన పాతూరి పార్వతి కుమార్తెను ఆమె సోదరుడి భార్య నాగలక్ష్మి, ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరుడు, వదినలతో కలిపి 8మంది గత నెల 25న కిడ్నాప్ చేసి, ప్రకాశం జిల్లా కందుకూరు మండలం కమ్మవారిపాలెంకు చెందిన బెజవాడ మనోజ్ కుమార్‌తో వివాహం జరిపించారు. అనంతరం నవంబర్ 27న పాలువాయిగేటు గ్రామానికి తీసుకువచ్చి మనోజ్ కుమార్‌తో కలిపి ఓ గదిలో బంధించి కాపురం చేయాల్సిందిగా వత్తిడి చేశారన్నారు. రెండు వారాలుగా తన కుమార్తెను వారంతా శారీరకంగాను, మానసికంగాను హింసిస్తున్నారని, తన కుమార్తెకు న్యాయం చేయాల్సిందిగా పార్వతి కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ కోటేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment