
ఒక్క అవకాశం ఇవ్వండి: ఎస్పీ రాజశేఖరబాబు
అనంతపురం: రాజకీయ కక్షలపై ఉక్కుపాదం మోపుతానని, ఒక్క అవకాశం ఇవ్వమని అనంతపురం ఎస్పీ రాజశేఖర బాబు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను, నేతలను కోరారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఈ ఉదయం హత్యకు గురైన వైఎస్ఆర్ సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్రెడ్డి మృతదేహంతో ఆ పార్టీ నేతలు ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చి నిరసన తెలిపారు. మృతదేహంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెండు గంటలపాటు అక్కడే బైఠాయించారు.
ఈ హత్యపై ఎస్పీ రాజశేఖర బాబు వివరణ ఇవ్వడంతో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన విరమించారు. తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. నేరస్తులను పట్టుకుంటానని ఎస్పీ హామీ ఇచ్చారు.