prasad reddy murder
-
గన్‌మెన్‌ను వెనక్కి రప్పించుకున్న పరిటాల సునీత
-
గన్‌మెన్‌ను వెనక్కి రప్పించుకున్న పరిటాల సునీత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత గన్‌మెన్‌ను వెనక్కి రప్పించుకున్నారు. ఈ రోజు ఉదయం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి సునీత గన్‌మెన్ రక్షణలో వచ్చారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యకేసులో ఇటుకలపల్లి సీఐ, రాప్తాడు ఎస్ఐలను వీఆర్‌కు పంపడంపై మంత్రి పరిటాల సునీతకు కోపం తెప్పించింది. ప్రభుత్వం తనకు కేటాయించిన ముగ్గురు గన్‌మెన్, ఐదుగురు ఎస్కార్ట్ సిబ్బందిని సునీత వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. పరిటాల సునీత డీజీపీ, హోంమంత్రితో సంప్రదించిన అనంతరం సీఐ, ఎస్ఐలను వీఆర్‌కు పంపకుండా యధాతథంగా అవే పోస్టుల్లో కొనసాగించారు. దీంతో సునీత గన్‌మెన్‌ను వెనక్కు రప్పించుకున్నారు. -
హత్య విషయం తెలిసి.. లేటుగా వచ్చారా?
అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రసాద్ రెడ్డి హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ప్రసాద్ రెడ్డిని హత్య చేయడానికి కొన్ని నిమిషాల ముందు ఆయన అనుచరుడు శివను దుండగులు కంప్యూటర్ గదిలో నిర్బంధించారు. ప్రసాద్‌రెడ్డిపై దాడి జరుగుతుందని ఎస్సై నాగేంద్ర ప్రసాద్‌కు ఫోన్ చేసినా..10 అడుగుల దూరంలో ఉన్నప్పటికీ ఎస్సై చాలా లేట్‌గా వచ్చారని ప్రత్యక్ష సాక్షి శివ చెబుతున్నారు. ఎస్సై సకాలంలో స్పందించి ఉంటే హత్య జరిగేది కాదని ప్రసాద్ రెడ్డి కుటుంబీకులు కూడా అంటున్నారు. ప్రసాద్‌రెడ్డిని హత్య చేయడానికి ముందురోజు ఆయన సోదరుడు మహానందరెడ్డిని కూడా హత్య చేయడానికి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మట్టి రవాణా వ్యవహారంలో అనంతపురం నుంచి రాప్తాడుకు మహానందరెడ్డి మూడుసార్లు వచ్చేలా ఎస్సై ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ సమయంలో ప్రత్యర్ధులు మహానందరెడ్డిని హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్‌రెడ్డి హత్య కేసును ఓ కొలిక్కి తీసుకురావాల్సిన పోలీసులు.. హత్య జరిగిన తరువాత చోటుచేసుకున్న పరిణామాలపై దృష్టిపెట్టారు. రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో ప్రసాద్‌రెడ్డిని ఆయన ప్రత్యర్ధులు నరికి చంపిన సంగతి తెలిసిందే. దీంతో మనస్తాపం చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు కొంత విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రసాద్ రెడ్డి హత్య కేసులో 14 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు...ఇప్పటిదాకా నలుగుర్ని మాత్రమే అరెస్ట్ చేశారు. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ఇటుకులపల్లి, కూడేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఓ పోలీసు ఉన్నతాధికారి ఒత్తిడితోనే అనంత పోలీసులు ప్రసాద్‌రెడ్డి హత్య కేసును పక్కనపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపణలు వెల్తువెత్తుతున్నాయి. -
మంత్రి గారికి కోపం వచ్చింది
వైఎస్ఆర్సీపీ నేత ప్రసాదరెడ్డి హత్యకేసులో ఎస్ఐ, సీఐలను వీఆర్‌కు పంపడంపై మంత్రి పరిటాల సునీత తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ప్రభుత్వం తనకు కేటాయించిన ముగ్గురు గన్‌మెన్, ఐదుగురు ఎస్కార్ట్ సిబ్బందిని వెనక్కి పంపేశారు. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు చెప్పాలని కూడా ఆమె చెప్పారు. వైఎస్ఆర్సీపీ నేత ప్రసాదరెడ్డి హత్య కేసులో ఇటుకులపల్లి ఎస్ఐ, రాప్తాడు సీఐలను డీఐజీ బాలకృష్ణ వీఆర్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ విషయమే మంత్రి పరిటాల సునీతకు కోపం తెప్పించింది. -
ప్రసాద్ రెడ్డి హత్యపై పోలీసు అధికారుల్లో చలనం
అనంతపురం: జిల్లాలోని రాప్తాడులో సంచలనం సృష్టించిన వైఎస్సార్సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్య కేసుకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారుల్లో చలనం మొదలైంది. దీనిలో భాగంగా జిల్లా పోలీసు అధికారులతో ఐజీ వీవీ గోపాలకృష్ణ గురువారం అనంతలో అత్యవసర సమావేశం అయ్యారు. హత్య కేసు నిందితులను పట్టుకోవటంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారంటూ ఆయన మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయిదే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. -
'ఆయనే ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారు'
రాజకీయంగా తమను ఎదుర్కోలేకే చంద్రబాబు ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ప్రసాదరెడ్డి హత్యను రాజకీయ హత్య కాదంటూ డీఐజీ, ఎస్పీ ప్రకటించడం దారుణమని ఆయన చెప్పారు. పోలీసుల అండదండలతోనే టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను హత్య చేస్తున్నారని అనంత ఆరోపించారు. అనంతపురం జిల్లాలో సాగుతున్న హత్యాకాండపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో సాగుతున్న హత్యాకాండపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
ప్రసాదరెడ్డి హత్య కేసులో టీడీపీ కార్యకర్తల అరెస్ట్
అనంతపురం: వైఎస్ఆర్ సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్‌రెడ్డి హత్యకేసులో 13 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. వారిలో నలుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని వారు వెల్లడించారు. రాప్తాడు టీడీపీ ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్, టీడీపీ నేత శ్రీనివాసులు నిందితుల జాబితాలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బి. ప్రసాదరెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. ఓ పని నిమిత్తం రాప్తాడు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆయనను అప్పటికే అక్కడ మాటు వేసిన ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. కాగా ఈ హత్య పథకం ప్రకారమే జరిగిందని... ఈ హత్యలో టీడీపీ నాయకులు హస్తం ఉందని ప్రసాదరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. -
ఒక్క అవకాశం ఇవ్వండి: ఎస్పీ రాజశేఖరబాబు
అనంతపురం: రాజకీయ కక్షలపై ఉక్కుపాదం మోపుతానని, ఒక్క అవకాశం ఇవ్వమని అనంతపురం ఎస్పీ రాజశేఖర బాబు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను, నేతలను కోరారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఈ ఉదయం హత్యకు గురైన వైఎస్ఆర్ సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్‌రెడ్డి మృతదేహంతో ఆ పార్టీ నేతలు ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. కార్యకర్తలు భారీ సంఖ్యలో వచ్చి నిరసన తెలిపారు. మృతదేహంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రెండు గంటలపాటు అక్కడే బైఠాయించారు. ఈ హత్యపై ఎస్పీ రాజశేఖర బాబు వివరణ ఇవ్వడంతో వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన విరమించారు. తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. నేరస్తులను పట్టుకుంటానని ఎస్పీ హామీ ఇచ్చారు. -
చంద్రబాబు సూచన మేరకే హత్య: భూమన
అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్సీపీ నేత ప్రసాదరెడ్డిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకే హతమార్చారని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. రానున్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యుగమేనని ఆయన స్పష్టం చేశారు. ఆచార్య ఎన్జీ రంగా మనవరాలు బోయపాటి మమత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్ నాయకత్వంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని మమత చెప్పారు. ఈ సందర్భంగానే కరుణాకర్ రెడ్డి మాట్లాడారు.