అత్యాధునికంగా గోదావరి ఎక్స్‌ప్రెస్ | godavari express train modernisation | Sakshi
Sakshi News home page

అత్యాధునికంగా గోదావరి ఎక్స్‌ప్రెస్

Published Tue, Apr 8 2014 10:11 PM | Last Updated on Tue, Oct 2 2018 8:10 PM

godavari express train modernisation

హైదరాబాద్, న్యూస్‌లైన్: వేసవి సెలవుల్లో రైలు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని ఏసీ బోగీలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతోంది. ముందుగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో మార్పులు చేశారు. ఈ ప్రయోగం ఫలిస్తే మరో 14 ఎక్స్‌ప్రెస్ రైళ్లనూ ఇదే విధంగా రూపొందించనున్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న ఏసీ బోగీలను అత్యంత ఖరీదైనవిగా, స్టార్ హోటళ్ల తరహాలో తీర్చిదిద్దారు. వీటిలో ఏపీ టూరిజం సీనరిస్ ఆకట్టుకుంటున్నాయి.

టాయిలెట్, మిర్రర్ లైటింగ్, ఎమర్జన్సీ విండో, కోచ్ నెంబరు, నెంబర్ ఇండికేషన్ బోర్డు, రైళ్ల రాకపోకల వివరాలను అమర్చారు. టాయిలెట్లలో కంట్రోల్ డిశ్చార్జ్ టాయిలెట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీనివల్ల టాయిలెట్ ద్వారా బయటకు రావాల్సిన వ్యర్థం రైల్వే స్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో బయటకు వస్తుంది. ఫలితంగా రైల్వే స్టేషన్లు అపరిశుభ్రం కాకుండా ఉంటాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లే వారికి ఫస్ట్ ఏసీ చార్జి రూ.2,205, సెకండ్ ఏసీ రూ.1,310, థర్డ్ ఏసీ రూ.925గా నిర్ణయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement