శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రూ.కోటి బంగారం పట్టివేత | Gold worth over Rs one crore recovered from air passenger at shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రూ.కోటి బంగారం పట్టివేత

Published Wed, Aug 21 2013 9:49 AM | Last Updated on Mon, Oct 8 2018 3:07 PM

Gold worth over Rs one crore recovered from air passenger at shamshabad airport

శంషాబాద్ ఎయిర్పోర్టులో బుధవారం ఉదయం ఓ ప్రయాణీకుడిని నుంచి భారీ ఎత్తున బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రషీద్ అనే ప్రయాణీకుడితోపాటు అతని లగేజీని తనిఖీ చేయగా పెద్ద ఎత్తున అభరణాలు కనుగొన్నామని తెలిపారు. ఉదయం 7.30 గం.లకు ఎయిర్ పోర్ట్ లో దిగిన అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం ఆభరణాల విలువ రూ. కోటి పైగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెప్పారు. అనంతరం అతడిని ఎయిర్పోర్ట్లోని పోలీసులకు అప్పగించామన్నారు. రషీద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement