నేటి నుంచే పోలీస్‌ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు | Goutam Sawang; Police Amaravirula Vaarostavalu started On October 15 | Sakshi
Sakshi News home page

నేటి నుంచే పోలీస్‌ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు

Published Tue, Oct 15 2019 4:01 PM | Last Updated on Tue, Oct 15 2019 5:22 PM

Goutam Sawang; Police Amaravirula Vaarostavalu started On October 15 - Sakshi

సాక్షి, విజయవాడ : పోలీసులపై ఉన్న అపోహలు తొలగిపోవడానికే ‘విజిట్‌​ పోలీస్‌ స్టేషన్‌’ అనే కార్యక్రమం మొదలుపెడుతున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. నేటి నుంచి  (మంగళవారం)  వారం రోజుల పాటు పోలీస్‌ అమర వీరుల  సంస్మరణ వారోత్సవాలు జరగనున్నాయని ఆయన వెల్లడించారు. అసలు పోలీసులు అంటే ఏమిటీ, వారి విధి నిర్వహణ ఎలా ఉంటుంది అనేది అందరూ తెలుసుకోవాలని సూచించారు.

ఈ వారోత్సవాల్లో మొదటి రోజు- పిల్లలకు పెయింటింగ్‌, కార్టూన్‌ పోటీలు.. రెండవరోజు- పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయనున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. మూడో రోజు- పోటీసు కుటుంబాల పిల్లలకు వికాస కార్యక్రమాలు.. నాల్గవ రోజు- విశాఖపట్నంలో రాష్ట్రస్థాయి మార్తన్‌, పోలీసు విధులపై అవగాహన కార్యక్రమం నిర్వహింనున్నామన్నారు. అయిదవరోజు  విద్యాసంస్ధల్లో శాంతి భద్రతలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నామని, ఆరవ రోజు- మెడికల్‌క్యాంపు, అమరవీరుల కుటుంబాలతో కలయిక  ఏర్పాటు చేయనునట్లు తెలిపారు. ఇక చివరగా ఏడో రోజున ఏఆర్‌ గ్రౌండ్స్‌లో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

అదే విధంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వస్తున్న ఆరోపణలు నిజం కావని, కేసు విచారణ సమర్థవంతంగా సాగుతుందని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు తాము పట్టించుకోమని, పోలీస్ వాళ్లు తామ పని తాము చేసుకుంటు పోతారని అన్నారు. రాష్ట్రంలో నక్సలైట్ల ప్రభావం తగ్గిందని, ప్రజలు మీద కూడా వీరి ప్రభావం చాలా మేరకు తగ్గిందని తెలిపారు. ప్రజాస్వమ్యం ద్వారా మాత్రమే మార్పు వస్తుందని, హింస ద్వారా ప్రజాస్వామ్యం రాదని పేర్కొన్నారు. మావోయిస్ట్ అరుణ పోలీసుల దగ్గర ఉన్నారనే అసత్య ప్రచారం చేస్తున్నారని, పోలీస్ అదుపులో ఏ మావోయిస్టు లేరని డీజీపీ స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement