సాక్షి, హైదరాబాద్: కులం, మతం, ప్రాంతం అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలూ 67వ స్వాతంత్య్ర దినోత్సవ(పంద్రాగస్టు) వేడుకలను ఐక్యంగా జరుపుకోవాలని గవర్నర్ నరసింహన్ ప్రజలకు పిలుపునిచ్చా రు. సమరయోధుల త్యాగాలను, నిస్వార్థ సేవానిరతిని అందరూ స్మరించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ సందేశం విడుదల చేశారు.
సీఎం ‘స్వాతంత్య్ర’ శుభాకాంక్షలు: రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని, అన్ని ప్రాంతాల, వర్గాల అభివృద్ధిలో ప్రభుత్వం సమతూకం పాటిస్తుందని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజలకు బుధవారం ఆయన ఓ సందేశం విడుదల చేశారు.
స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ పెంపు
రాష్ట్ర స్వాతంత్య్ర సమరయోధులకు వచ్చే నెలవారీ పింఛను రూ.4 వేల నుంచి రూ.7 వేలకు పెరిగింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వీకే అగర్వాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పంద్రాగస్టును ఐక్యంగా జరుపుకోండి: గవర్నర్
Published Thu, Aug 15 2013 4:39 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
Advertisement
Advertisement