
సాక్షి, తిరుమల : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరుమల పర్యటన ఖరారైంది. శ్రీవారి దర్శనార్థం రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 13న తిరుమలకు రానున్నారు. ఆ రోజు తిరుమలలో బస చేసి.. 14న ఉదయం కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం తిరుగు ప్రయాణం కానున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రెండు రోజుల పాటు తిరుమలలోనే ఉండనున్నట్లు సమాచారం.