సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ సీనియర్లు, నాయకుల బృందం రేపు(శనివారం) సాయంత్రం 4 గంటలకు గవర్నర్ నరసింహన్‌ను కలవనుంది. మాజీ ఎంపీ, మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో సహా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ హత్యలను, రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనుంది. దీంతో పాటు టీడీపీ హత్యా రాజకీయాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ప్రదర్శనలకు వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చింది. నల్ల చొక్కాలు, నల్ల రిబ్బన్లు ధరించి, నల్ల జెండాలతో గాంధీ విగ్రహాల వద్ద శాంతియుత ప్రదర్శనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.
చదవండి:
వివేకానందరెడ్డి హత్య వెనక పెద్ద కుట్రే!
చిన్నాన్న తలపై ఐదుసార్లు గొడ్డలితో నరికారు..
రేపు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్
Published Fri, Mar 15 2019 10:01 PM | Last Updated on Fri, Mar 15 2019 10:03 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment