హెల్త్ కార్డులపై కుదరని ఏకాభిప్రాయం | Government employees decry health fund ceiling | Sakshi
Sakshi News home page

హెల్త్ కార్డులపై కుదరని ఏకాభిప్రాయం

Published Thu, Oct 31 2013 3:08 PM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM

Government employees decry health fund ceiling

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులపై ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో ఉద్యోగులు గురువారం సమావేశం అయ్యారు. భేటీ అనంతరం ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ దీపావళిలోగా హెల్త్ కార్డుల అంశాన్ని తేల్చాలని సీఎస్ను కోరామన్నారు. ప్రభుత్వం విధించదలచుకున్న రూ. 2లక్షల సీలింగ్ ఎత్తివేయకపోతే ....హెల్త్ కార్డుల పథకంలో చేరేది లేదని తేల్చి చెప్పామన్నారు.

ఉత్తర్వులు తమకు అనుకూలంగా లేకుంటే అంగీకరించేది లేదని అశోక్ బాబు స్పష్టం చేశారు. సీలింగ్ ఎత్తివేయాల్సిందేనని... ఉద్యోగుల డిమాండ్లపై స్పష్టత వచ్చాకే జీవో ఇవ్వాలన్నారు. యూనివర్శిటీ, ఎయిడెడ్, లైబ్రరీ ఉద్యోగులను కూడా హెల్త్ కార్డుల పథకంలో చేర్చాలని టీఎన్జీవో సంఘం నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు సీలింగ్తో తమకు సంబంధం లేదని... సీలింగ్ ఎత్తివేయకపోయినా తాము హెల్త్ పథకంలో చేరతామని సచివాలయ ఉద్యోగులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement