ఎట్టకేలకు | Government hospital will be attached with medical college | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు

Published Wed, Nov 20 2013 4:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM

Government hospital will be attached with medical college

 నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ :  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఎట్టకేలకు మెడికల్ కళాశాలకు అనుసంధానం చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యవిధాన పరిషత్ సిబ్బందిని బోధన్ ఆస్పత్రికి తరలించనున్నారు. వచ్చే ఏడాది జనవరి ఒకటిలోగా ఆస్పత్రిని మెడికల్ కళాశాలకు అనుసంధానం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీ డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్  (ఏపీవీపీ) ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి అనుసంధానం వేగంగా చేపట్టాలని సూచించారు. ఇప్పటికే ఆలస్యం అయ్యింద నీ, రోగులకు ఇబ్బందులు కలుగుతున్నందున ఆస్ప త్రి మార్పుపై దృష్టి పెట్టాలన్నారు. దీనికి సంబంధించిన విధివిధాలను వివరించారు. మెడికల్ కళాశాలకు అవసరమైన వైద్య సిబ్బంది, వైద్యులు, పరిపాల న వ్యవహారాలకు సంబంధించి ఉద్యోగులను నియమించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరి యా ఆస్పత్రులకు  చెందిన వైద్య సిబ్బందిని కళాశాల కు బదిలీ చేయాలన్నారు. దశలవారీగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కొత్తగా నిర్మించిన భవనాలను, వివిధ విభాగాలను స్వాధీనం చేసుకోవాలని ఆదే  శించారు. దీంతో 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లాకు మంజూరు చేసిన కళాశాలకు తుది రూపం వస్తోంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతితో ఈ ఏడాది జూన్‌లో వైద్య కళాశాలలో మొదటి బ్యాచ్ ప్రారంభమైన విషయం తెలి సిందే!
 ఇక మెరుగైన వైద్య సేవలు  
 ఆస్పత్రి వైద్యకళాశాల పరిధిలోకి వెళ్తే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశముంది. 123 మంది నిపుణులైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వివిధ  విభాగాలకు నిపుణులైన టెక్నికల్ సిబ్బంది అందుబాటులోకి వస్తారు. దీంతో అత్యవసర సేవలు, దీర్ఘకాలి క వ్యాధులకు వైద్యం అందే అవకాశం ఉంది. రోజూ ఆస్పత్రికి వచ్చే 700 మంది అవుట్ పేషెంట్లు, 550 ఇన్ పేషెంట్లకు ఇబ్బంది లేకుండా సేవలు అందుతా యి. పరిపాలనలో విభాగంలోకి ముగ్గురేసి సూపరిం టెండెంట్‌లు, ఆర్‌ఎంఓలు, నర్సింగ్ సూపరింటెండెంట్‌లు వస్తారు. పర్యవేక్షణ పెరిగి వైద్యసేవలు అందుతాయి. వైద్యులు షిప్టులవారీగా రోగులకు అందుబాటులో ఉంటారు.  
 జనవరిలోగా మార్పు చేస్తాం
 -శాంతకుమార్, డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
 ఆస్పత్రిని జనవరిలోగా మార్పు చేస్తాం. ఈ మేరకు వైద్యవిధాన పరిషత్, డీఎంఈ అధికారులకు ఆదేశా లు అందాయి. ఈ ప్రక్రియ అమలుకు  కృషి చేస్తున్నాం. పరిపాలన వ్యవహారాలు, వైద్యులు, సిబ్బంది ఇతర పనుల మార్పులు, కేటాయింపులను పరిశీలిస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement