Ajay sahani
-
ఏపీలో పలు శాఖలు, విభాగాలకు ఇంచార్జ్‌ల నియామకం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న పలువురు అఖిల భారత సర్వీసు అధికారులు ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీలో తెలంగాణకు వెళ్లడంతో ఏపీ సర్కారు పలు శాఖలు, విభాగాలకు ఇంచార్జులను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీలో తెలంగాణకు కేటాయించిన ఐదుగురు ఐఏఎస్‌లను, ఒక ఐపీఎస్ అధికారిని, నలుగురు ఐఎఫ్ఎస్ అధికారులను మినహాయించి మిగిలిన వారిని ఆదివారం రిలీవ్ చేసింది. అజయ్ సహాని, సిద్దార్ధ జైన్, అజయ్ జైన్, ఆర్.వి. కర్ణన్, అనిల్ కుమార్ సింఘాల్‌ను ఏపీలో కొనసాగించాలని కేంద్రాన్ని కోరినందున వారిని రిలీవ్ చేయలేదు. అలాగే సస్పెన్షన్‌లో ఉన్న వై. శ్రీలక్ష్మిని, అలాగే ట్రిబ్యునల్ స్టే ఆర్డర్ ఉన్న ఎ. విద్యాసాగర్, సి. హరికిరణ్, జి. శ్రీజనలను రిలీవ్ చేయలేదు. మిగిలిన 44 మంది ఐఏఎస్‌లను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క ఐపీఎస్‌లలో ప్రస్తుతం ఏపీ ఇంటిలిజెన్స్ అదనపు డీజీగా ఉన్న ఎ.ఆర్. అనురాధను భార్య, భర్తల కేసుల్లో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని కేంద్రాన్ని కోరినందున ఆమెను మినహాయించి మిగిలిన 23 మంది ఐపీఎస్‌లను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా తెలంగాణకు కేటాయించిన ఐఎఫ్ఎస్ అధికారుల్లో నలుగురిని మినహాయించి మిగిలిన 30 మంది ఐఎఫ్ఎస్లను రిలీవ్ చేశారు. వీరందరినీ తెలంగాణ ప్రభుత్వంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక, సస్పెన్షన్‌లో ఉన్న ఐఎఫ్ఎస్లు రాజేశ్ మిట్టల్, ఎ. కృష్ణను తెలంగాణకు కేటాయించినప్పటికీ వారిని రిలీవ్ చేయలేదు. అలాగే తెలంగాణకు కేటాయించినా భార్యా, భర్తల కేసు ఆధారంగా రాహుల్ పాండే. సి. శెల్వం ఐఎఫ్ఎస్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీవ్ చేయలేదు. ఏపీ, తెలంగాణకు కేటాయించిన అఖిల భారత సర్వీసు అధికారులతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ కూడా ఏపీ ప్రభుత్వం ఆదివారం జారీ చేసింది. కొందరికి అంతర్గత సర్దుబాట్ల కింద కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఇలా బి. ఉదయ లక్ష్మి బీసీ సంక్షేమ కమిషనర్, అంతర్గత సర్దుబాటు కింద రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, మార్కెటింగ్ శాఖ కమిషనర్, సహకార శాఖ కమిషనర్ బాధ్యతలు. మహ్మద్ ఇక్బాల్ మైనారిటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి. అంతర్గత సర్దుబాటు కింద సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండీ, వాణిజ్య పన్నుల కమిషనర్ కార్యదర్శి, సర్వే సెటిల్మెంట్ డెరైక్టర్. కోన శశిధర్ ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ. అంతర్గత సర్దుబాటు కింద యువజన, పర్యాటక డిప్యుటీ కార్యదర్శి, శాప్ వైస్ చైర్మన్, ఎండీ, సహాయ పునరావాస సంయుక్త కార్యదర్శి. జి. వీరపాండ్యన్ ఉపాధి హామీ డెరైక్టర్, అంతర్గత సర్దుబాటు కింద మహిళా శిశు సంక్షేమ డిప్యూటీ కార్యదర్శి, మెప్మా డెరైక్టర్, ఏపీ మున్సిపల్ అభివృద్ధి ప్రాజెక్టు పీడీ. ఎం.వి.ఎస్.ఎ. సోమయాజులు సాధారణ పరిపాలన శాఖ డిప్యుటీ కార్యదర్శి. అంతర్గత సర్దుబాటు కింద అదనపు ముఖ్య ఎన్నికల అధికారి, గృహనిర్మాణ సంస్థ ఈడీ. లింగరాజు పాణిగ్రాహి ఆర్ఐఎడీ ముఖ్యకార్యదర్శి. వి. శివశంకరరావు సాధారణ పాలన(సర్వీసెస్), అధికార భాష ఉప కార్యదర్శి. -
సీఎంవోలో సతీష్ చంద్ర కీలకం!
త్వరలో కేంద్ర సర్వీసుకు వెళ్లనున్న అజయ్ సహానీకి శాఖల కోత సతీష్ చంద్రకు జీఏడీ, నూతన రాజధాని సహా పలు శాఖలు సాక్షి, హైదరాబాద్: ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య కార్యదర్శిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర సీఎంవోలో ఇక కీలక అధికారిగా మారనున్నారు. త్వరలో కేంద్ర సర్వీసుకు వెళ్లనున్న ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీ శాఖల్లో భారీగా కోతలు విధించడం, అనేక శాఖలను సతీష్ చంద్రకు అప్పగించడంతో ఈ విషయం స్పష్టమవుతోంది. తన పేషీ అధికారులు చూడాల్సిన శాఖల్లో (సబ్జెక్టుల్లో) సీఎం తాజాగా అనేక మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుతం అజయ్ సహాని నిర్వహిస్తున్న సాధారణ పరిపాలన శాఖ, నూతన రాజధాని, ముఖ్యమంత్రి కార్యాలయం నిర్వహణ, మహిళా శిశు సంక్షేమం, న్యాయ, అసెంబ్లీ, ఐటీ. అటవీ పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక అంశాలతో పాటు ఎవరికీ కేటాయించని అంశాలన్నింటినీ సతీష్ చంద్రకు కేటాయించారు. ప్రస్తుతం సీఎం మరో ముఖ్య కార్యదర్శి గిరిధర్ దగ్గర ఉన్న మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖను, అలాగే సీఎం కార్యదర్శి సాయి ప్రసాద్ దగ్గరున్న పర్యావరణ, అటవీ శాఖలను సతీష్ చంద్రకు కేటాయించారు. దీంతో గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యవహరించినట్లే ఇప్పుడు కూడా సీఎంవోలో సతీష్ చంద్ర కీలకంగా వ్యవహరిస్తారనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక అజయ్ సహానీకి కేవలం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖను మాత్రమే ఉంచారు. గిరిధర్‌కు మున్సిపల్, హోం, ఆర్థిక, వ్యవసాయం, అన్ని రకాల విద్యలు, రెవెన్యూ శాఖలను కేటాయించారు. సాయిప్రసాద్‌కు ఇంధన, పరిశ్రమలు, ఇరిగేషన్, గృహ నిర్మాణం, అన్ని రకాల సంక్షేమం, కార్మిక, పంచాయతీరాజ్ శాఖలను కేటాయించారు. -
కీలక కేడర్‌లో భారీ మార్పులు!
ప్రత్యూష్‌సిన్హా కమిటీ తుది కసరత్తు పూర్తి తెలంగాణకు ఆంధ్రా సీఎం పేషీ ముఖ్యకార్యదర్శి అజయ్‌సహానీ ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ నుంచి బీపీ ఆచార్య, బీఆర్ మీనాలు త్వరలో ప్రధానమంత్రికి ఫైలు.. వారంలో జాబితా ప్రకటన! సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత సివిల్ సర్వీసెస్ అధికారుల తుది కేటాయింపు జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 20 మంది అధికారుల కేడర్‌లో మార్పులు, చేర్పులు చేస్తూ ప్రత్యూష్‌సిన్హా కమిటీ తుది జాబితాను ఖరారు చేసినట్లు ఆ కమిటీ వర్గాలు తెలిపాయి. అఖిల భారత అధికారుల కేటాయింపునకు సంబంధించి గత నెల చివరలో ముసాయిదా జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాపై ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల నుంచి దాదాపు వందకు పైగా అభ్యంతరాలు వచ్చాయి. ఈ అభ్యంతరాలను చైర్మన్ ప్రత్యూష్‌సిన్హా నేతృత్వంలో కమిటీ సోమవారం ఢిల్లీలో సమావేశమై పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ఐ.వై.ఆర్.కృష్ణారావు, రాజీవ్‌శర్మలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు భేటీ అయిన కమిటీ భారీ మార్పులతో తుది జాబితాను సిద్ధం చేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన అధికారులను తెలంగాణకు కేటాయించడం, 1983 బ్యాచ్ బినయ్‌కుమార్ కేంద్ర సర్వీసును పరిగణనలోకి తీసుకోవద్దని చేసిన విజ్ఞప్తికి ప్రత్యూష్‌సిన్హా పెద్ద పీట వేసినట్లు చెప్తున్నారు. తాత్కాలిక కేటాయింపులో బినయ్కుమార్ను ఆంధ్రాకు కేటాయించారు. అయితే తెలంగాణకు కేటాయిస్తే భవిష్యత్‌లో సీఎస్ అయ్యే అవకాశం ఉన్నందున బినయ్‌కుమార్ కేంద్ర సర్వీసును పరిగణనలోకి తీసుకోరాదని విజ్ఞప్తిచేశారు. దీంతో పాటు మరికొన్ని ఇతర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ తుది జాబితాలో భారీ మార్పులు చేసింది. ప్రధానంగా ముసాయిదా జాబితాలో కేటాయింపు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ఖరారైన బినయ్‌కుమార్ అభ్యంతరాన్ని పరిశీలించడంతో రోస్టర్‌లో మార్పులు చోటుచేసుకున్నట్టు సమాచారం. కేంద్ర సర్వీసును తీసేసి రాష్ట్ర సర్వీసును మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఈ జాబితాలో మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే ఔట్ సైడర్ అధికారులు ఇతర రాష్ట్రాల్లో పని చేసి ఇక్కడికి బదిలీ అయి రావడం కారణంగా వారిని సంబంధిత బ్యాచ్‌లో చివరగా తీసుకుని సర్వీసును లెక్కించినట్టు సమాచారం. ఈ జాబితాను నేడో రేపో కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ప్రధానమంత్రికి పంపనుంది. ప్రధానమంత్రి ఆమోదించిన తరువాత ఈ తుది జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియకు వారం రోజులు పట్టే అవకాశం ఉందని కమిటీ వర్గాలు తెలిపాయి. మారిన అధికారుల కేడర్ ఇలా..! తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు..: ఎస్.ఎస్.రావత్, పి.వి.రమేశ్, బి.పి.ఆచార్య, బి.ఆర్.మీనా, ఆధిత్యనాథ్‌దాస్, దినేష్‌కుమార్, జె.రామానంద్, శాంతికుమారి, వీణా ఈష్, అనంతరాం, నీలం సహాని, షాలినిమిశ్రా తదితరులు ఉన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు..: బినయ్‌కుమార్, అజయ్‌సహానీ, అజయ్‌జైన్, అదర్‌సిన్హా, రంజీవ్ ఆర్ ఆచార్య తదితరులున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన ఐఏఎస్ అధికారి జె.ఎస్.వి.ప్రసాద్ అభ్యర్థనను కమిటీ తిరస్కరించింది. ఆయన తెలంగాణలోనే ఉంటారు. -
ఎట్టకేలకు
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఎట్టకేలకు మెడికల్ కళాశాలకు అనుసంధానం చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యవిధాన పరిషత్ సిబ్బందిని బోధన్ ఆస్పత్రికి తరలించనున్నారు. వచ్చే ఏడాది జనవరి ఒకటిలోగా ఆస్పత్రిని మెడికల్ కళాశాలకు అనుసంధానం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీ డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ (ఏపీవీపీ) ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రి అనుసంధానం వేగంగా చేపట్టాలని సూచించారు. ఇప్పటికే ఆలస్యం అయ్యింద నీ, రోగులకు ఇబ్బందులు కలుగుతున్నందున ఆస్ప త్రి మార్పుపై దృష్టి పెట్టాలన్నారు. దీనికి సంబంధించిన విధివిధాలను వివరించారు. మెడికల్ కళాశాలకు అవసరమైన వైద్య సిబ్బంది, వైద్యులు, పరిపాల న వ్యవహారాలకు సంబంధించి ఉద్యోగులను నియమించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరి యా ఆస్పత్రులకు చెందిన వైద్య సిబ్బందిని కళాశాల కు బదిలీ చేయాలన్నారు. దశలవారీగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కొత్తగా నిర్మించిన భవనాలను, వివిధ విభాగాలను స్వాధీనం చేసుకోవాలని ఆదే శించారు. దీంతో 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లాకు మంజూరు చేసిన కళాశాలకు తుది రూపం వస్తోంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతితో ఈ ఏడాది జూన్‌లో వైద్య కళాశాలలో మొదటి బ్యాచ్ ప్రారంభమైన విషయం తెలి సిందే! ఇక మెరుగైన వైద్య సేవలు ఆస్పత్రి వైద్యకళాశాల పరిధిలోకి వెళ్తే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశముంది. 123 మంది నిపుణులైన ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వివిధ విభాగాలకు నిపుణులైన టెక్నికల్ సిబ్బంది అందుబాటులోకి వస్తారు. దీంతో అత్యవసర సేవలు, దీర్ఘకాలి క వ్యాధులకు వైద్యం అందే అవకాశం ఉంది. రోజూ ఆస్పత్రికి వచ్చే 700 మంది అవుట్ పేషెంట్లు, 550 ఇన్ పేషెంట్లకు ఇబ్బంది లేకుండా సేవలు అందుతా యి. పరిపాలనలో విభాగంలోకి ముగ్గురేసి సూపరిం టెండెంట్లు, ఆర్‌ఎంఓలు, నర్సింగ్ సూపరింటెండెంట్లు వస్తారు. పర్యవేక్షణ పెరిగి వైద్యసేవలు అందుతాయి. వైద్యులు షిప్టులవారీగా రోగులకు అందుబాటులో ఉంటారు. జనవరిలోగా మార్పు చేస్తాం -శాంతకుమార్, డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆస్పత్రిని జనవరిలోగా మార్పు చేస్తాం. ఈ మేరకు వైద్యవిధాన పరిషత్, డీఎంఈ అధికారులకు ఆదేశా లు అందాయి. ఈ ప్రక్రియ అమలుకు కృషి చేస్తున్నాం. పరిపాలన వ్యవహారాలు, వైద్యులు, సిబ్బంది ఇతర పనుల మార్పులు, కేటాయింపులను పరిశీలిస్తున్నాం. -
ఆస్పత్రుల్లో స్కానింగ్యంత్రాలపై పరిమితులు: అజయ్ సహాని
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలోని ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లు, ఆస్పత్రి వర్గాలు సంబంధిత అధికారుల అనుమతి లేకుండా స్కానింగ్యంత్రాలు కొనుగోలు చేయకూడదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహాని ఆదేశించారు. తయారీ దారులు, దిగుమతిదారులు, డీలర్లు, సరఫరాదారులు, ఏజెంట్లు యంత్రాలు సరఫరా చేస్తున్నప్పుడు రాష్ట్ర అధికారుల నుంచి రిజిస్టర్ చేయించుకోవాలని పేర్కొన్నారు. సరఫరాదారులు లేదా డీలర్లు ప్రతి మూడు నెలలకోసారి అమ్మకాలకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలా చేయక పోతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనుమతి లేకుండా అల్ట్రాసౌండ్ మెషిన్లను విక్రయించడం, నెలకొల్పడం ద్వారా లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని, వీటిని నివారించేందుకే చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. నర్సింగ్‌హోమ్ యజమానులు యంత్రాలు కొనుగోలు చేసినప్పుడు అధికారులు విధిగా పరిశీలిస్తారని అన్నారు. స్కానింగ్ పరీక్షలు చేసే ఆస్పత్రులు ప్రతి నెలా నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు.