
సాక్షి, అమరావతి: తెలుగు భాషకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం వ్యతిరేకం కాదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాము కూడా తెలుగు భాషా ప్రేమికులమేనని చెప్పారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు నేర్చుకోవచ్చని తెలిపారు. ఇంటరీ్మడియెట్‌లో తెలుగు ఉందని, తెలుగు బీఏ, ఎంఏ ఉందని, తెలుగులో పీహెచ్‌డీ కూడా చేయవచ్చని గుర్తుచేశారు. ఆయన శనివారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల సంఘం మహాసభల వేదికపై మండలి బుద్ధప్రసాద్, మరికొందరు టీడీపీ నేతలు మాట్లాడిన తీరు అభ్యంతకరంగా ఉందన్నారు. వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నానని చెప్పారు. తెలుగు భాషను విస్మరిస్తున్నారంటూ కొందరు కక్షపూరితంగా ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగు భాష తల్లిలాంటిదని, తమ ప్రభుత్వం తెలుగును ఎప్పుడూ గౌరవిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన కన్నతల్లిని ఎలా ప్రేమిస్తారో... తెలుగు భాషను సైతం అలాగే ప్రేమిస్తారని పేర్కొన్నారు.
పేదల వర్గాల కోసమే ఇంగ్లిష్ మీడియం
ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో చదువుకునే శక్తి లేని బడుగు, బలహీన వర్గాల కోసమే ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతోందని అంబటి రాంబాబు చెప్పారు. తమ పిల్లలు తెలుగు మీడియంలో చదువుకోవాలని కోరుకునే తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? అని ప్రశి్నంచారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకువచ్చేలా పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలో చదివించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తెలుగు భాషకు అన్యాయం, ద్రోహం జరిగినట్లుగా కొందరు మాట్లాడుతున్నారని తప్పపట్టారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జీవో
టీడీపీ ప్రభుత్వ హయాంలోనే స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని జీవో ఇచ్చారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. తెలుగుపై అంత ప్రేమ ఉంటే ఆ జీవో ఎందుకు ఇచ్చారని నిలదీశారు. కార్పొరేట్ స్కూళ్ల కోసం ప్రభుత్వ పాఠశాలలను నిరీ్వర్యం చేసింది చంద్రబాబు ప్రభుత్వమే కదా అని ప్రశి్నంచారు. ప్రభుత్వం ఏం చేసినా ప్రతికూలంగా రాయడమే కొన్ని పత్రికలు పనిగా పెట్టుకున్నాయని ధ్వజమెత్తారు. పత్రికాధిపతుల పిల్లలు ఏ మీడియంలో చదువుకుంటున్నారు? వారు నిర్వహించే కళాశాలలు ఏ మీడియంలో ఉన్నాయో చెప్పాలని మండిపడ్డారు. తెలుగు రచయితల సభల పేరుతో తప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. అమరావతి ప్రాంతంలో మీడియా వారిపై దాడికి టీడీపీ బాధ్యత వహించాలని ఈ దాడిని, తాము ఖండిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment