ప్రభుత్వ మద్యం దుకాణాలకు టెండర్లు | Government tenders for liquor shops | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ మద్యం దుకాణాలకు టెండర్లు

Published Sun, Jan 5 2014 3:30 AM | Last Updated on Tue, Jun 4 2019 6:31 PM

Government tenders for liquor shops

కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే మద్యం దుకాణాలకు శనివారం టెండర్లు పిలిచారు. కొడంగల్, దౌల్తాబాద్, గట్టు, ఘనపూర్, నర్వ, గద్వాల పట్టణం, కోస్గి, నారాయణపేట, అమరచింత, ఆమనగల్లు, విఠాయిపల్లి, కొత్తకోట, పెద్దమందడి మద్యం దుకాణాలు కొనసాగుతాయి. ఈ దుకాణాల టెండర్లను పకడ్బందీగా నిర్వహించాలని డిఆర్వో రాంకిషన్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.
 
 శనివారం తన చాంబర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన 13 దుకాణాల టెండర్ షెడ్యూళ్లను ఆయన ప్రకటించారు. ఈ దుకాణాల కోసం ఇదివరకే ఎనిమిదిసార్లు టెండర్లు నిర్వహించామని, ఎవరూ ముందుకురాని కారణంగా 9వ సారి నిర్వహిస్తున్నామని చెప్పారు. వీరి నిర్వహణ కోసం ముందుకొచ్చేవారికి అవగాహన కల్పించాలని కోరారు. ఈనెల 6 వరకు టెండర్లు దాఖలు చే చేయొచ్చన్నారు. 7న ఉదయం టెండర్లను ఓపెన్ చేస్తామన్నారు. కార్యక్రమంలో  సీనియర్ అసిస్టెంట్ విజయ్‌తోపాటు, కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement