మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం | governments failed in women protection | Sakshi
Sakshi News home page

మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం

Published Thu, Mar 9 2017 11:29 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం

మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం

► ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

కడప కార్పొరేషన్‌: మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి విమర్శించారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఇక్కడి వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో నగర మహిళా విభాగం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అవినాష్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మేయర్‌ కె.సురేష్‌బాబులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ తల్లిగా, చెల్లిగా, భార్యగా మహిళలకు ఎంతో ఉన్నత స్థానముందని, ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించినప్పుడే సమాజం బాగుపడుతుందన్నారు. నగర మహిళా అధ్యక్షురాలు టీపీ వెంకటసుబ్బమ్మ మాట్లాడుతూ టీడీపీ అధకారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై అరాచకాలు, దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు వారు మహిళలకు లెమన్‌ అండ్‌ స్పూన్, మ్యూజికల్‌ చైర్స్, పాటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. చీరెలు పంపిణీ చేశారు. మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు ఉమామహేశ్వరి,  శ్రీలక్ష్మి, సంధ్యారాణి, క్రిష్ణవేణి, సుశీల మ్మ, తులశమ్మ, పద్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement