గవర్నర్, సీఎం, బాబు శుభాకాంక్షలు
Published Fri, Aug 9 2013 2:59 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గవర్నర్ నరసింహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లా కృపాకటాక్షాలు కలగాలని ఆకాం క్షించారు. మహమ్మద్ ప్రవక్త ప్రవచించిన సూక్తులు ప్రతి తరానికి మార్గదర్శకాలని గురువారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అహ్మదుల్లా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి చిరంజీవి వేర్వేరు ప్రకటనల్లో రాష్ట్రంలోని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Advertisement
Advertisement