బ్రహ్మంగారిమఠం, న్యూస్‌లైన్ : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్ధానంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబల కల్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
స్థానిక మఠాధిపతులు శ్రీవీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి దంపతులు కల్యాణ ఉత్సవంలో పాల్గొనగా కందుకూరి వెంకట గోవిందశర్మ, తెనాలి వేదపాఠశాల ప్రిన్సిపాల్ జనార్ధనాచారి, కొమ్మారి విశ్వరూపాచారి, బి.రామబ్రహ్మం అర్చకులు స్వామి కల్యాణాన్ని నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అంతకు ముందు మఠం ఆస్థాన కవి బ్రహ్మం గారు రచించిన కాలజ్ఞానంలో వున్న భవిష్యత్తు గురించి భక్తులకు ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో స్ధానిక మఠం పెద్దాచార్యులు, వీరభద్రాచారి, వేదపండితులు పాల్గొన్నారు.
భక్తులకు దర్శనమిచ్చిన మఠాధిపతులు...
గురువారం మధ్యాహ్నం మఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి ఆస్థాన మండపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కల్యాణ మహోత్సవాలను ఉత్సవాల ప్రత్యేక అధికారి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది, పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్‌ఐ ధనుంజయుడు, ఎండోమెంట్ జిల్లా అధికారి, తహవీల్దారు, ఎంపీడీఓ, మఠం మేనేజర్ ఈశ్వరయ్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఈశ్వరిదేవి మఠంలో ఉత్సవాలు...
శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మనమరాలు మాతా ఈశ్వరిదేవి మఠంలో కూడ స్థానిక ఈ.ఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా కల్యాణ మహోత్సవాలు నిర్వహించారు.
ఘనంగా వీరబ్రహ్మం కల్యాణం
Published Fri, Feb 28 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM
Advertisement
Advertisement