అనంతలో బ్రహ్మానందం: అభిమానులపై లాఠీచార్జి! | Brahmanandam visited in Ananthapuram | Sakshi
Sakshi News home page

అనంతలో బ్రహ్మానందం: అభిమానులపై లాఠీచార్జి!

Published Thu, Feb 6 2014 7:44 PM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

అనంతలో బ్రహ్మానందం: అభిమానులపై లాఠీచార్జి! - Sakshi

అనంతలో బ్రహ్మానందం: అభిమానులపై లాఠీచార్జి!

అనంతపురం: ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అనంతపురం పర్యటన అభిమానులపై లాఠిచార్జికి దారి తీసింది. గురువారం స్థానిక రానినగర్ లోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమానికి బ్రహ్మనందం హాజరయ్యారు. బ్రహ్మనందంను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు.
 
అభిమానులు అదుపు చేయడానికి భారీ ఎత్తున పోలీసులను నియమించారు. ఓ దశలో అభిమానులను అదుపు చేయడానికి పోలీసులు నానా కష్టాలు పడ్డారు. పరిస్థితి చాయిదాటిపోతుందనే తరణంలో అభిమానులు, భక్తులపై పోలీసులు లాఠీ చార్జీ జరిపారు. ఈ లాఠీచార్జీలో పలువురు అభిమానులకు స్వల్పంగా గాయపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement