ఆస్పత్రి సొసైటీలకు మార్గదర్శకాలు  | Guidelines for Hospital Societies | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి సొసైటీలకు మార్గదర్శకాలు 

Published Wed, Oct 23 2019 4:47 AM | Last Updated on Wed, Oct 23 2019 4:47 AM

Guidelines for Hospital Societies - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు మొదలుకుని.. బోధనాస్పత్రుల వరకూ ఆస్పత్రి అభివృద్ధి సొసైటీల నిర్వహణపై ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదలచేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డా.కేఎస్‌ జవహర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. నిధుల వినియోగం, నిర్వహణ, మెరుగైన వైద్యసేవలందేలా పర్యవేక్షణ తదితర వాటిని దృష్టిలో ఉంచుకుని మార్గదర్శకాలను జారీచేసినట్టు పేర్కొన్నారు. గతంలో ఇష్టారాజ్యంగా ఈ సొసైటీలకు సభ్యులను నియమించడంతో సకాలంలో సమావేశాలు నిర్వహించలేకపోవడం, సమీక్షలు లేకపోవడం, నిధులు వినియోగం కాకపోవడం వంటివి జరిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని సొసైటీలకు కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఆయుష్‌ ఆస్పత్రులకూ సంబంధిత అధికారులతో కార్యవర్గాలను ఏర్పాటు చేశారు.

విధులు..
- రోజూ ఆస్పత్రుల పనితీరుపై పర్యవేక్షణ
నిబంధనల మేరకు రోగులకు వైద్య పరీక్షలు అందుతున్నాయో లేదో పరిశీలన 
సిబ్బంది నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు 
- పీహెచ్‌సీ స్థాయిలో 3 నెలలకోసారి పనితీరు అంచనా 
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల అమలుపై పర్యవేక్షణ
- ఆస్పత్రి అభివృద్ధి సొసైటీలో ఉన్న నిధుల వినియోగం, వైద్య పరికరాల అవసరాలు తదితరాల పర్యవేక్షణ 
- సిటిజన్‌ చార్టర్‌ (రోజువారీ అందాల్సిన సేవల జాబితా) అందుబాటులో ఉండేలా చూడటం
ఆస్పత్రులకు విరాళాలిచ్చే దాతలను గుర్తించి ఆస్పత్రులను అభివృద్ధి చేయడం
- వివిధ పథకాల నుంచి వచ్చే గ్రాంట్లను సకాలంలో సద్వినియోగమయ్యేలా చూడటం 
- ఆస్పత్రుల స్థాయిని బట్టి చైర్‌పర్సన్‌లకు నిధుల వ్యయం అధికారాలివ్వడం 

ఆయా ఆస్పత్రుల కార్యవర్గాలు ఇలా..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం..
చైర్‌పర్సన్‌గా: ఎంపీపీ
కన్వీనర్‌గా: మెడికల్‌ ఆఫీసర్‌. మరో నలుగురు సభ్యులు
సీహెచ్‌సీ..
చైర్‌పర్సన్‌గా: ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే
కన్వీనర్‌గా: ఆస్పత్రి మెడికల్‌ ఆఫీసర్‌. నలుగురు సభ్యులు
ఏరియా ఆస్పత్రి
చైర్‌పర్సన్‌: ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే 
కన్వీనర్‌: ఆస్పత్రి సూపరింటెండెంట్‌ 
ప్రత్యేక ఆహ్వానితులు: మున్సిపల్‌ కమిషనర్‌.
ఏడుగురు సభ్యులు
జిల్లా ఆస్పత్రి 
చైర్‌పర్సన్‌: ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే 
కన్వీనర్‌: సూపరింటెండెంట్‌.
డీఎంహెచ్‌వోతో పాటు.. మరో ఏడుగురు సభ్యులు
బోధనాస్పత్రి 
చైర్‌పర్సన్‌: కలెక్టర్‌ 
కో–చైర్‌పర్సన్‌: ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే 
కన్వీనర్‌: సూపరింటెండెంట్‌. 9 మంది సభ్యులు 
మెడికల్‌ కాలేజీలు 
చైర్‌పర్సన్‌: డీఎంఈ లేదా అకడమిక్‌ డీఎంఈ
కన్వీనర్‌: సూపరింటెండెంట్‌. ఇద్దరు సభ్యులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement