దుబాయి అని చెప్పి ... ముంబైలో దింపేశారు
ఏలూరు : పశ్చిమగోదావరి జల్లాలో గల్ఫ్ ఏజెంట్ల మోసం మరోసారి బయటపడింది. గల్ఫ్ ఏజెంట్ల మాయమాటలో పడి జిల్లాలోని మొగల్తూరు గ్రామానికి చెందిన దాదాపు 45 మంది యువకులు మోసపోయారు. గల్ఫ్ పంపిస్తామంటూ ఏజెంట్లు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. లక్షన్నర వసూలు చేశారు. ఇటీవల హైదరాబాద్లో వారిని విమానం ఎక్కించిన ఏజెంట్లు ముంబైలో వదిలేశారు.
దాంతో సదరు యువకులు రెండు రోజుల పాటు ముంబైలో చిక్కుకుపోయారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బు తెప్పించుకుని స్వస్థలాలకు చేరుకున్నారు. జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఏజెంట్ల నుంచి తమ డబ్బును ఇప్పించాలని మెగల్తూరు యువకులు శుక్రవారం అందోళనకు దిగారు.