►గుంటూరు, విజయవాడ మధ్య ప్రజారాజధాని నిర్మించాలి
► బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.గంగాధర్
గాంధీనగర్ : రాజధాని విషయంలో సీఎం చంద్రబాబు పునరాలోచించాలని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.గంగాధర్ అన్నారు. స్థానిక జనసభ రాష్ర్ట కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మకి కంపెనీ డిజైన్ విషయంలోనే కాదు, రాజధాని విషయంలోనే పునఃసమీక్ష జరపాలని కోరారు. రాజధాని విషయంలో ప్రతిపక్షాలు, నిపుణు లు, ప్రజాసంఘాలు ఎవరెంత చెప్పినా సీఎం చంద్రబాబు తన వ్యక్తిగత, బంధుమిత్రగణ స్వార్థ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ మూ ర్ఖంగా నిర్ణయాలు చేయడం సరికాదన్నారు.
విభజనతో నష్టపోయిన అవశేషాంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు తన నిర్ణయాలతో మరింత సంక్షో భం, అగాథంలోకి నెట్టివేస్తున్నారని, ఆయనను భావితరాలు క్షమించవన్నారు. ప్రపంచ స్థాయి రాజధాని పేరుతో తాను కలల్లో తేలిపోతూ ప్రజల్ని త్రిశంకు స్వర్గంలో ముంచి తేలుస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.వీరబ్రహ్మం, చప్పిడి కృష్ణమోహన్, రాష్ర్ట ఆర్గనైజింగ్ సెక్రటరీ జక్కా శ్రీనివాసరావు, పటాకుల నరసింహారావు, మరీదు ప్రసాద్ పాల్గొన్నారు.