ఉత్తుత్తి ఉత్సవానికి రూ.కోటి | GVMC Funds Wastage With Unknown Celebrations | Sakshi
Sakshi News home page

ఉత్తుత్తి ఉత్సవానికి రూ.కోటి

Published Sat, Dec 15 2018 7:32 AM | Last Updated on Sat, Dec 15 2018 7:32 AM

GVMC Funds Wastage With Unknown Celebrations - Sakshi

డివైడర్లకు రంగులు వేస్తున్న కార్మికులు

రాష్ట్రపతి వస్తున్నారని ఓ సారి.. ప్రధాని వచ్చారని మరోసారి.. బిల్‌గేట్స్‌ వచ్చారని ఇంకోసారి.. బ్రిక్స్‌ సదస్సు జరుగుతోందని మళ్లీ ఓ సారి.. సీఎం సారు చెప్పారని అదే పని మరోసారి... ఎవరు వచ్చినా.. పదే పదే అదే పని.. మారేది రంగు మాత్రమే.. మిగతాదంతా సేమ్‌ టూ సేమ్‌.. జీవీఎంసీ ఖాతాలో నిధులు రోడ్లపై రంగుల రూపంలో మారిపోతున్నాయి. ఉత్తుత్తి ఉత్సవ్‌ విద్యుత్‌ వెలుగుల్లో మాడిపోతున్నాయి. ఖజానాకి కోట్ల రూపాయల చిల్లులు పెడుతున్నాయి. కాంట్రాక్టర్లకు, ఇంజినీర్లకు మాత్రం రంగులమయ జీవితాలను అందిస్తున్నాయి.

విశాఖ సిటీ: నగరంలో ఏదైనా సదస్సు జరి గినా, ప్రముఖులు వచ్చినా జీవీఎంసీ కాం ట్రాక్టర్లు, ఇంజినీర్ల పంట పండినట్లే. సుందరీకరణ పేరుతో వీరంతా అందినకాడికి దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా రు. ఏదైనా ప్రధాన కార్యక్రమం జరిగితే చాలు అందరి చూపూ డివైడర్లకు రంగులు, ఫుట్‌పాత్‌లకు హంగులపైనే ఉంటుంది. వెంటనే టెండర్లు పిలవడం.. రంగులు వేసెయ్యడం.. బిల్లులు పాస్‌ చేసుకొని ఖజానా సొమ్ముని జేబుల్లో వేసుకోవడం... రెండేళ్లుగా గ్రేటర్‌లో ఇదే దందా సాగుతోంది. తాజాగా విశాఖ ఉత్సవ్‌ పేరుతో మరో ప్రహసనానికి తెరతీస్తోంది. విశాఖ ఉత్సవ్‌ పేరుతో ఏటా సాగరతీరంలో దుబారా ఉత్సవాలను సర్కారు నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు సాగే ఈ ప్రహసనానికి ప్రభుత్వ విభాగాల నిధులు దుర్వినియోగమవుతున్నాయి. ఈ ఉత్సవ్‌కు ఏటా స్పందన అంతంతమాత్రమే. వివాదాల నడుమ నడుస్తూ.. దేశ విదేశీ పర్యాటకులు రాని సమయంలో నిర్వహించడంతో ఓ ఉత్తుత్తి ఉత్సవ్‌లా మారిపోయింది. అలాంటి ఉత్సవానికి జీవీఎంసీ ఖజానా నుంచి ఏటా రూ.కోటి వరకూ ఖర్చు చేయిస్తున్నారు. పెయింటింగ్స్‌కు రూ.60 నుంచి రూ.70 లక్షలు,  విద్యుత్‌ వెలుగులకు రూ.30 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటిని కార్పొరేషన్‌ సమర్పిస్తోంది.

ఇదీ పనుల తీరు
2016 ఫిబ్రవరిలో అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ జరిగినప్పుడు ఫుట్‌పాత్‌లు, డివైడర్లకు రంగులు వేశారు.
ఆరు నెలలు గడిచిన తర్వాత బ్రిక్స్‌ సదస్సంటూ 2016 సెప్టెంబర్‌లో మళ్లీ రంగులేశారు.
ఈ ఏడాది మేలో జరిగిన తెలుగుదేశం మహానాడు సమయంలో అదేదో ప్రభుత్వ ఘన కార్యక్రమమం టూ లక్షలాది రూపాయలు తగలేసి తెలుపు, పసుపు రంగులు వేసి జీవీఎంసీ అధికార యంత్రాగం సర్కారుపై వీర విధేయతను చాటుకుంది.      అగ్రి హ్యాకథాన్‌కు బిల్‌గేట్స్‌ వచ్చారని ఇంకోసారి ఇలా.. ఎప్పుడంటే అప్పుడు సర్కారు ఆదేశించడం.. జీవీఎంసీ సిబ్బంది రంగులు వేయించేయడం జరుగుతోంది.

విద్యుత్‌ వెలుగులకు రూ.27 లక్షలు
ఈ నెల 28, 29, 30వ తేదీల్లో విశాఖ ఉత్సవ్‌ నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్ల కు సంబంధించిన విషయంలో నగర పరిశుభ్రత, సుందరీకరణ బాధ్యత మహా విశా ఖ నగర పాలక సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో కేవలం విద్యుత్‌ వెలు గులకు రూ.27 లక్షలకు పైగా జీవీఎంసీ ఖర్చు చేస్తోంది. బీచ్‌లో ఫ్లడ్‌లైట్లు, విమానాశ్రయం నుంచి నగరంలో అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ ధగధగలతో మెరిసిపోయేలా, బీచ్‌ ప్రాంగణమంతా విద్యుత్‌ దీపాలంకరణ చేసే బాధ్యత జీవీ ఎంసీదే. ఇందుకోసం 9 షార్ట్‌ టైమ్‌ టెండర్లను జీవీఎంసీ ఆహ్వానించింది. తొమ్మిది ప్రాంతాల్లో చేపట్టే పనుల విలువ రూ. 27,28,144. ఈ ఖర్చంతా కేవలం మూడు రోజుల ముచ్చటకు మాత్రమే.  

వాటి వివరాలివీ..
విమానాశ్రయం నుంచి పార్క్‌ హోటల్‌ వరకూ సీరియల్‌ లైట్ల ఏర్పాటుకు             రూ.4.04లక్షలతో టెండర్‌.
రాజీవ్‌ స్మృతి భవన్‌ నుంచి పార్క్‌ హోటల్‌ వరకూ సీరియల్‌ లైట్ల ఏర్పాటుకు         రూ.2,91,300తో టెండర్‌.
ఎన్‌టీఆర్‌ విగ్రహం నుంచి కోస్టల్‌ బ్యాటరీ ఏరియా వరకూ విద్యుత్‌ దీపాల             అలంకరణ కోసం రూ.4,41,300తో టెండర్‌
బీచ్‌రోడ్డులోని విగ్రహాల వద్ద ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు, ఒడ్డులో ఫ్లడ్‌లైట్ల ఏర్పాటుకు         రూ.2,84,077తో టెండర్‌.
పాండురంగాపురం సమీపంలోని బీచ్‌ వద్ద తాత్కాలిక లైటింగ్, జెనరేటర్‌
పవర్‌ ప్లగ్స్, తీరంలో తాత్కాలిక లైటింగ్‌ కోసం రూ.4,64,797లతో టెండర్‌.

డివైడర్లకు అవినీతి రంగు
ఇక ప్రధాన కూడళ్లలో డివైడర్లకు రంగుల పేరుతో ప్రజాధనం మంచినీళ్లలా వృథా చేస్తున్నారు. ఐలాండ్స్‌ల ఆధునికీకరణ పేరుతో పనులు చేపట్టారు. ఫుట్‌పాత్‌లు, డివైడర్లు, వాటి మధ్యన ఉన్న ఇనుప గ్రిల్స్‌ బాగానే ఉన్నప్పటికీ మరమ్మతులు, పెయింటింగ్స్‌ పేరుతో ఆయా జోన్‌ల పరిధిలో వార్డుల వారీగా ప్రధాన కేంద్రాల్లో టెండర్లను పిలిచారు. నీటితో కడిగి శుభ్రపరిస్తే తళతళలాడేలా మెరిసిపోయే వాటికి మళ్లీ కొత్తగా రంగులు వేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు జోన్ల పరిధిలో ఈ పనులు జరుగుతున్నాయి. గతంలో మొత్తం 8 జోన్లలోనూ ప్రతిసారీ ఈ తరహా పనులకు దాదాపు రూ.కోటి వరకూ ఖర్చు చేసేవారు. ప్రస్తుతం నాలుగు జోన్లలో పనుల కోసం సుమారు రూ.60 లక్షలకు పైగా ఖర్చవుతోంది. ఒక్కో జోన్‌లో పెయింటింగ్‌ పనులను 5 విభాగాలుగా విడగొట్టి టెండర్లను పిలిచారు.

వారికి నచ్చిన సంస్థలకు టెండర్‌ దక్కేలా నిబంధనలు మార్చేశారు. దీంతో ఆయా జోన్ల పరిధిలో 4 నుంచి 5 పనులకు పిలిచినా ఒక్కరికే టెండర్‌ దక్కుతుండడం గమనార్హం. అయితే ఈ నిబంధనను కొన్ని జోన్లలో మాత్రమే అమలు చేస్తున్నారు. దీనివల్ల ఇంజినీర్ల చేతులు తడిపే వారికే పనులు దక్కుతున్నాయి. చదరపు మీటర్‌కు రూ.430.18 చొప్పున చెల్లించేలా ధర నిర్ణయించారు. ఇదిలా ఉండగా డివైడర్లకు ఒక ప్రైమరీ కోటింగ్‌ వేసిన తర్వాత ఎమల్షన్‌ పెయింట్స్‌ రెండు కోటింగ్‌లు వెయ్యాలన్నది నిబంధన. కానీ కాంట్రాక్టర్లు దీన్ని తారుమారు చేసేస్తున్నారు. ప్రైమరీ కోటింగ్‌ వెయ్యకుండానే ఎమల్షన్‌ కోటింగ్‌ వేసేస్తున్నారు. అది కూడా కొన్ని చోట్ల ఎమల్షన్‌ పెయింటింగ్‌ను కూడా ఒకే కోటింగ్‌తో సరిపెట్టేస్తున్నారు. ఇలా ఉత్తుత్తి ఉత్సవానికి పెయింటింగ్, లైటింగ్‌ పేరుతో ఖజానా ఖాళీ చేసే పనులు జరుగుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement