GVMC officer
-
స్వచ్ఛ ఓటుకు చివరి అవకాశం
విశ్వ నగరి విశాఖను స్వచ్ఛత విషయంలోనూ అత్యున్నతమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రజలు భుజానికెత్తుకున్నారు. సిటిజన్ ఫీడ్‌బ్యాక్ విషయంలో ఇన్నాళ్లూ వెనుకబడిన విశాఖ నగరం.. ఇప్పుడు ప్రజా చైతన్యంతో ఏకంగా ఉత్తరాది రాష్ట్రాలతో పోటీపడి దూసుకుపోతోంది. నేటితో స్వచ్ఛ సర్వేక్షణ్ ముగియనుండటంతో చివరిరోజు ఉన్న అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని జీవీఎంసీ అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌ని ఓ క్రతువులా నిర్వహిస్తుండటంతో ప్రజల్లో యాప్ డౌన్లోడ్ విషయంలో చైతన్యం వెల్లివిరుస్తున్నప్పటికీ యాప్ వినియోగించే విషయంలో మాత్రం నిర్లక్ష్యం చూపిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ప్రజలు ఇదే రీతిలో స్పందించి ఈ స్థానాన్ని నిలబెడితే నగరం కచ్చితంగా టాప్–10లో నిలుస్తుంది. సాక్షి, విశాఖపట్నం: విశాఖ మహా నగరం స్వచ్ఛత విషయంలోనూ పరుగులెడుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో మొదటి రెండేళ్లూ టాప్ 5లో చోటు దక్కించుకున్న విశాఖ గతేడాది మాత్రం ఒక్కసారిగా చతికలపడిపోయింది. ఈసారి మాత్రం టాప్–10లో ఉండేందుకు జీవీఎంసీ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ర్యాంకు విషయంలో ప్రజలే కీలక పాత్ర పోషించాల్సిన నేపథ్యంలో వైజాగ్ వాసులు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరాన్ని అగ్ర భాగాన నిలబెట్టేందుకు విశేషంగా స్పందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆయా నగరాలకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రదానం చేస్తోంది. నగరాల్లో ఉండే మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలన, ఇళ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణం, రవాణా వ్యవస్థ, చెత్తశుద్ధి నిర్వహణ మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డులకు నగరాల్ని ఎంపిక చేస్తోంది. నేడే చివరి రోజు ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించినా ఈ నెల 4 నుంచి 31 వరకూ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ప్రధానమైన భాగం. ఈ సమయంలోనే దేశంలో ఉన్న అన్ని నగరాల్లో స్వచ్ఛ బృందం పర్యటించి క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తారు. విశాఖ నగరంలో ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. అయితే గార్బేజ్ ఫ్రీసిటీ(జీఎఫ్‌సీ) స్టార్ రేటింగ్ ఇచ్చేందుకు పరిశీలన బృందం కూడా నగరంలో ఉంది. శుక్రవారం సాయంత్రంతో ఈ రేటింగ్ పరిశీలన కూడా పూర్తి కానుంది. గతేడాది 2 స్టార్ రేటింగ్‌లో ఉన్న నగరం ఇప్పుడు 5 స్టార్ రేటింగ్ కోసం దరఖాస్తు చేసుంది. మరోవైపు శుక్రవారం చివరి రోజు కావడంతో నగర ప్రజలు సహకరించాలని జీవీఎంసీ విజ్ఞప్తి చేస్తోంది. స్వచ్ఛతా హెల్ప్‌లైన్ నంబర్ 1969కి పౌరులు ఫోన్ చేసి తమ ప్రాంతంలోని పరిశుభ్రత, తదితర అంశాలపై ఫీడ్ బ్యాక్ తెలియపరచవచ్చు. లేదా స్వచ్ఛతా యాప్, స్వచ్ఛ సర్వేక్షణ్–2020 పోర్టల్ ద్వారా గానీ, ఓట్ ఫర్ యువర్ సిటీ యాప్ ద్వారా గానీ పౌరులు స్పందన తెలియజేసేందుకు శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకే సమయం ఉంది. ఈ కొద్ది గంటల పాటు ప్రజలు నగర గౌరవం కోసం శ్రమిస్తే.. స్వచ్ఛతలో టాప్–10లో చోటు దక్కించుకోవచ్చు. ఉత్తమ స్థానంలో నగరాన్ని నిలబెడదాం.. స్వచ్ఛ సర్వేక్షణ్–2020 నిబంధనల్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తడిపొడి చెత్త విభజన, సేకరణ, రవాణాకు అధిక ప్రాధాన్యమిచ్చాం. చెత్త ప్రొసెసింగ్ దినచర్యగా మారుతోంది. ఇప్పటి వరకు ఉన్న 7 తడి చెత్త, 5 పొడిచెత్త ప్రొసెసింగ్ యూనిట్లు పూర్తి సామర్థ్యంతో వినియోగిస్తున్నాం. ఓఎఫ్‌డీ ప్లస్ ప్లస్ నగరంగా కొనసాగేందుకు జీవీఎంసీ పరిధిలో ఉన్న 328 కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణలో లోపాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. చివరి రోజున ప్రజలంతా విశాఖ నగరాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సహకరించాలి.– జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ ప్రజలే వారధులు స్వచ్ఛతలో నగరాన్ని అత్యుత్తమ స్థాయిలో నిలబెట్టేందుకు జీవీఎంసీ తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రజలు కూడా మంచి సహకారం అందిస్తున్నారు. కీలకమైన ప్రశ్నలకు మంచి సమాధానాలు ఇస్తే.. వైజాగ్ మంచి ర్యాంకు సాధించగలదు. కమిషనర్ సూచనలతో నగర వ్యాప్తంగా 8 ప్రశ్నలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రజల సహకారం చివరి రోజూ అదే స్థాయిలో అందిస్తే టాప్–10లోకి దూసుకుపోతాం. – విశ్వనాథ సన్యాసిరావు, జీవీఎంసీ అదనపు కమిషనర్ -
పారిశుద్ధ్య కార్మికులకు @18 వేలు
మహా విశాఖ నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు పండగొచ్చింది. ఎండనక, వాననక నిత్యం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికుల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టి సారించారు. వారి ఆరోగ్య భద్రత కోసం హెల్త్ అలవెన్సు కింద నెలకు రూ.6 వేల చొప్పున వేతనంతో కలిపి ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జీవీఎంసీ పరిధిలో 5,130 మంది కార్మికులకు కనీస వేతనం రూ.18 వేలుగా మారడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: పారిశుద్ధ్య కార్మికులు.. నిరంతరం మురుగులో పనిచేస్తుంటారు. చెత్త కంపు కొడుతున్నా.. దాన్ని సేకరించడం.. డంపర్ బిన్లలో వేయడం... మినీ వ్యానుల్లో తరలించడం.. కాల్వలు శుభ్రం చేయడం.. ఇలా నిత్యం చెత్తతోనే సావాసం చేస్తుంటారు. కుళ్లిపోయిన వ్యర్థాల నుంచి విష వాయువులు వెలువడుతున్నా.. వాటిని తొలగించాల్సిందే. ఫలితంగా వారి ఆరోగ్యాలు అంపశయ్యపై ఉన్నాయి. అయినా పనికి రాకపోతే పూటగడవని పరిస్థితి. తమ ఆరోగ్యాల్ని పట్టించుకోండి మహా ప్రభో అంటూ వందల సార్లు గత ప్రభుత్వాలకు విన్నవించినా పట్టించుకున్న పాపానపోలేదు. కనీస వేతనం అందక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విధులకు హాజరైన పరిస్థితులెన్నో ఉన్నాయి. చాలీచాలని వేతనం జిల్లా, జీవీఎంసీ పరిధుల్లో పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా వారికి అలవెన్సు ప్రకటించాలని గత టీడీపీ ప్రభుత్వానికి మున్సిపల్ యూనియన్లు ఎన్నో దఫాలుగా విజ్ఞప్తులు చేశారు. వినతిపత్రాలు అందించారు. కానీ.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరించారు. దీంతో విసుగెత్తిన కార్మిక సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ధర్నాలు, సమ్మెలు చేసినా ఫలితం లేదు. భారమే.. అయినా... ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు అలవెన్స్ మంజూరు చేయడం వల్ల ప్రభుత్వానికి, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లపై నెల నెలా కోట్ల రూపాయిల భారం పడనుంది. అయినా.. కార్మికుల సంక్షేమమే ముఖ్యమని తలచి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అలవెన్సుని అందించడం వల్ల జీవీఎంసీపై నెలకు రూ.3.09 కోట్ల అదనపు భారం పడనుంది. ఏడాదికి రూ.37.08 కోట్లు అదనంగా ఖర్చవనుంది. ప్రభుత్వ నిర్ణయంతో జీవీఎంసీ పరిధిలోని 5,130 మంది, నర్సీపట్నం మున్సిపాలిటీలోని 92 మంది, యలమంచిలి మున్సిపాలిటీలోని 90 మంది ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు లబ్ధి చేకూరనుంది. మాటిచ్చారు..నిలబెట్టుకున్నారు.. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామంటూ ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆ హామీని నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్న వారందరికీ హెల్త్ అలవెన్సు కింద రూ. 6వేలు వారి వేతనంతో పాటు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఈ అలవెన్సుతో పారిశుద్ధ్య కార్మికుని వేతనం రూ. 18 వేలకు చేరుకుంది. ఈ అలవెన్సుని ప్రతి నెలా 5న చెల్లించాలని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి ఈ అలవెన్సుని మంజూరయ్యేలా లెక్కించాలని సూచించింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూశాం... రోజూ నగరం శుభ్రం చేయాలని ఎంతో కష్టపడుతున్నాం. కానీ.. మమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వమే లేదు. రోజూ చెత్తలోనే జీవనం సాగిస్తుండటం వల్ల రోగాలు చుట్టుముడుతున్నాయి. అయినా ఏ ప్రభుత్వమూ దాని గురించి పట్టించుకోలేదు. సీఎం జగన్ మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ రోజు కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూశాం.– కింతాడ శ్రీనివాసరావు,పారిశుద్ధ్య కార్మికుడు -
ఉత్తుత్తి ఉత్సవానికి రూ.కోటి
రాష్ట్రపతి వస్తున్నారని ఓ సారి.. ప్రధాని వచ్చారని మరోసారి.. బిల్‌గేట్స్ వచ్చారని ఇంకోసారి.. బ్రిక్స్ సదస్సు జరుగుతోందని మళ్లీ ఓ సారి.. సీఎం సారు చెప్పారని అదే పని మరోసారి... ఎవరు వచ్చినా.. పదే పదే అదే పని.. మారేది రంగు మాత్రమే.. మిగతాదంతా సేమ్ టూ సేమ్.. జీవీఎంసీ ఖాతాలో నిధులు రోడ్లపై రంగుల రూపంలో మారిపోతున్నాయి. ఉత్తుత్తి ఉత్సవ్ విద్యుత్ వెలుగుల్లో మాడిపోతున్నాయి. ఖజానాకి కోట్ల రూపాయల చిల్లులు పెడుతున్నాయి. కాంట్రాక్టర్లకు, ఇంజినీర్లకు మాత్రం రంగులమయ జీవితాలను అందిస్తున్నాయి. విశాఖ సిటీ: నగరంలో ఏదైనా సదస్సు జరి గినా, ప్రముఖులు వచ్చినా జీవీఎంసీ కాం ట్రాక్టర్లు, ఇంజినీర్ల పంట పండినట్లే. సుందరీకరణ పేరుతో వీరంతా అందినకాడికి దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా రు. ఏదైనా ప్రధాన కార్యక్రమం జరిగితే చాలు అందరి చూపూ డివైడర్లకు రంగులు, ఫుట్‌పాత్‌లకు హంగులపైనే ఉంటుంది. వెంటనే టెండర్లు పిలవడం.. రంగులు వేసెయ్యడం.. బిల్లులు పాస్ చేసుకొని ఖజానా సొమ్ముని జేబుల్లో వేసుకోవడం... రెండేళ్లుగా గ్రేటర్లో ఇదే దందా సాగుతోంది. తాజాగా విశాఖ ఉత్సవ్ పేరుతో మరో ప్రహసనానికి తెరతీస్తోంది. విశాఖ ఉత్సవ్ పేరుతో ఏటా సాగరతీరంలో దుబారా ఉత్సవాలను సర్కారు నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు సాగే ఈ ప్రహసనానికి ప్రభుత్వ విభాగాల నిధులు దుర్వినియోగమవుతున్నాయి. ఈ ఉత్సవ్‌కు ఏటా స్పందన అంతంతమాత్రమే. వివాదాల నడుమ నడుస్తూ.. దేశ విదేశీ పర్యాటకులు రాని సమయంలో నిర్వహించడంతో ఓ ఉత్తుత్తి ఉత్సవ్‌లా మారిపోయింది. అలాంటి ఉత్సవానికి జీవీఎంసీ ఖజానా నుంచి ఏటా రూ.కోటి వరకూ ఖర్చు చేయిస్తున్నారు. పెయింటింగ్స్‌కు రూ.60 నుంచి రూ.70 లక్షలు, విద్యుత్ వెలుగులకు రూ.30 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటిని కార్పొరేషన్ సమర్పిస్తోంది. ఇదీ పనుల తీరు ♦ 2016 ఫిబ్రవరిలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరిగినప్పుడు ఫుట్‌పాత్‌లు, డివైడర్లకు రంగులు వేశారు. ♦ ఆరు నెలలు గడిచిన తర్వాత బ్రిక్స్ సదస్సంటూ 2016 సెప్టెంబర్‌లో మళ్లీ రంగులేశారు. ♦ ఈ ఏడాది మేలో జరిగిన తెలుగుదేశం మహానాడు సమయంలో అదేదో ప్రభుత్వ ఘన కార్యక్రమమం టూ లక్షలాది రూపాయలు తగలేసి తెలుపు, పసుపు రంగులు వేసి జీవీఎంసీ అధికార యంత్రాగం సర్కారుపై వీర విధేయతను చాటుకుంది. అగ్రి హ్యాకథాన్‌కు బిల్‌గేట్స్ వచ్చారని ఇంకోసారి ఇలా.. ఎప్పుడంటే అప్పుడు సర్కారు ఆదేశించడం.. జీవీఎంసీ సిబ్బంది రంగులు వేయించేయడం జరుగుతోంది. విద్యుత్ వెలుగులకు రూ.27 లక్షలు ♦ ఈ నెల 28, 29, 30వ తేదీల్లో విశాఖ ఉత్సవ్ నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్ల కు సంబంధించిన విషయంలో నగర పరిశుభ్రత, సుందరీకరణ బాధ్యత మహా విశా ఖ నగర పాలక సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో కేవలం విద్యుత్ వెలు గులకు రూ.27 లక్షలకు పైగా జీవీఎంసీ ఖర్చు చేస్తోంది. బీచ్‌లో ఫ్లడ్‌లైట్లు, విమానాశ్రయం నుంచి నగరంలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ ధగధగలతో మెరిసిపోయేలా, బీచ్ ప్రాంగణమంతా విద్యుత్ దీపాలంకరణ చేసే బాధ్యత జీవీ ఎంసీదే. ఇందుకోసం 9 షార్ట్ టైమ్ టెండర్లను జీవీఎంసీ ఆహ్వానించింది. తొమ్మిది ప్రాంతాల్లో చేపట్టే పనుల విలువ రూ. 27,28,144. ఈ ఖర్చంతా కేవలం మూడు రోజుల ముచ్చటకు మాత్రమే. వాటి వివరాలివీ.. ♦ విమానాశ్రయం నుంచి పార్క్ హోటల్ వరకూ సీరియల్ లైట్ల ఏర్పాటుకు రూ.4.04లక్షలతో టెండర్. ♦ రాజీవ్ స్మృతి భవన్ నుంచి పార్క్ హోటల్ వరకూ సీరియల్ లైట్ల ఏర్పాటుకు రూ.2,91,300తో టెండర్. ♦ ఎన్టీఆర్ విగ్రహం నుంచి కోస్టల్ బ్యాటరీ ఏరియా వరకూ విద్యుత్ దీపాల అలంకరణ కోసం రూ.4,41,300తో టెండర్ ♦ బీచ్‌రోడ్డులోని విగ్రహాల వద్ద ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు, ఒడ్డులో ఫ్లడ్‌లైట్ల ఏర్పాటుకు రూ.2,84,077తో టెండర్. ♦ పాండురంగాపురం సమీపంలోని బీచ్ వద్ద తాత్కాలిక లైటింగ్, జెనరేటర్ ♦ పవర్ ప్లగ్స్, తీరంలో తాత్కాలిక లైటింగ్ కోసం రూ.4,64,797లతో టెండర్. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో విశాఖ ఉత్సవ్ నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్ల కు సంబంధించిన విషయంలో నగర పరిశుభ్రత, సుందరీకరణ బాధ్యత మహా విశా ఖ నగర పాలక సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. దీంతో కేవలం విద్యుత్ వెలు గులకు రూ.27 లక్షలకు పైగా జీవీఎంసీ ఖర్చు చేస్తోంది. బీచ్‌లో ఫ్లడ్‌లైట్లు, విమానాశ్రయం నుంచి నగరంలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ ధగధగలతో మెరిసిపోయేలా, బీచ్ ప్రాంగణమంతా విద్యుత్ దీపాలంకరణ చేసే బాధ్యత జీవీ ఎంసీదే. ఇందుకోసం 9 షార్ట్ టైమ్ టెండర్లను జీవీఎంసీ ఆహ్వానించింది. తొమ్మిది ప్రాంతాల్లో చేపట్టే పనుల విలువ రూ. 27,28,144. ఈ ఖర్చంతా కేవలం మూడు రోజుల ముచ్చటకు మాత్రమే. వాటి వివరాలివీ.. ♦ విమానాశ్రయం నుంచి పార్క్ హోటల్ వరకూ సీరియల్ లైట్ల ఏర్పాటుకు రూ.4.04లక్షలతో టెండర్. ♦ రాజీవ్ స్మృతి భవన్ నుంచి పార్క్ హోటల్ వరకూ సీరియల్ లైట్ల ఏర్పాటుకు రూ.2,91,300తో టెండర్. ♦ ఎన్టీఆర్ విగ్రహం నుంచి కోస్టల్ బ్యాటరీ ఏరియా వరకూ విద్యుత్ దీపాల అలంకరణ కోసం రూ.4,41,300తో టెండర్ ♦ బీచ్‌రోడ్డులోని విగ్రహాల వద్ద ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు, ఒడ్డులో ఫ్లడ్‌లైట్ల ఏర్పాటుకు రూ.2,84,077తో టెండర్. ♦ పాండురంగాపురం సమీపంలోని బీచ్ వద్ద తాత్కాలిక లైటింగ్, జెనరేటర్ ♦ పవర్ ప్లగ్స్, తీరంలో తాత్కాలిక లైటింగ్ కోసం రూ.4,64,797లతో టెండర్. డివైడర్లకు అవినీతి రంగు ఇక ప్రధాన కూడళ్లలో డివైడర్లకు రంగుల పేరుతో ప్రజాధనం మంచినీళ్లలా వృథా చేస్తున్నారు. ఐలాండ్స్ల ఆధునికీకరణ పేరుతో పనులు చేపట్టారు. ఫుట్‌పాత్‌లు, డివైడర్లు, వాటి మధ్యన ఉన్న ఇనుప గ్రిల్స్ బాగానే ఉన్నప్పటికీ మరమ్మతులు, పెయింటింగ్స్ పేరుతో ఆయా జోన్ల పరిధిలో వార్డుల వారీగా ప్రధాన కేంద్రాల్లో టెండర్లను పిలిచారు. నీటితో కడిగి శుభ్రపరిస్తే తళతళలాడేలా మెరిసిపోయే వాటికి మళ్లీ కొత్తగా రంగులు వేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు జోన్ల పరిధిలో ఈ పనులు జరుగుతున్నాయి. గతంలో మొత్తం 8 జోన్లలోనూ ప్రతిసారీ ఈ తరహా పనులకు దాదాపు రూ.కోటి వరకూ ఖర్చు చేసేవారు. ప్రస్తుతం నాలుగు జోన్లలో పనుల కోసం సుమారు రూ.60 లక్షలకు పైగా ఖర్చవుతోంది. ఒక్కో జోన్లో పెయింటింగ్ పనులను 5 విభాగాలుగా విడగొట్టి టెండర్లను పిలిచారు. వారికి నచ్చిన సంస్థలకు టెండర్ దక్కేలా నిబంధనలు మార్చేశారు. దీంతో ఆయా జోన్ల పరిధిలో 4 నుంచి 5 పనులకు పిలిచినా ఒక్కరికే టెండర్ దక్కుతుండడం గమనార్హం. అయితే ఈ నిబంధనను కొన్ని జోన్లలో మాత్రమే అమలు చేస్తున్నారు. దీనివల్ల ఇంజినీర్ల చేతులు తడిపే వారికే పనులు దక్కుతున్నాయి. చదరపు మీటర్‌కు రూ.430.18 చొప్పున చెల్లించేలా ధర నిర్ణయించారు. ఇదిలా ఉండగా డివైడర్లకు ఒక ప్రైమరీ కోటింగ్ వేసిన తర్వాత ఎమల్షన్ పెయింట్స్ రెండు కోటింగ్‌లు వెయ్యాలన్నది నిబంధన. కానీ కాంట్రాక్టర్లు దీన్ని తారుమారు చేసేస్తున్నారు. ప్రైమరీ కోటింగ్ వెయ్యకుండానే ఎమల్షన్ కోటింగ్ వేసేస్తున్నారు. అది కూడా కొన్ని చోట్ల ఎమల్షన్ పెయింటింగ్‌ను కూడా ఒకే కోటింగ్‌తో సరిపెట్టేస్తున్నారు. ఇలా ఉత్తుత్తి ఉత్సవానికి పెయింటింగ్, లైటింగ్ పేరుతో ఖజానా ఖాళీ చేసే పనులు జరుగుతున్నాయి. -
ముందస్తుగా సమ్మర్ ప్లాన్
విశాఖసిటీ: జీవీఎంసీ పరిధిలో ఏటా ఫిబ్రవరి నెలలో వేసవి ప్రణాళిక రూపొందించేవారిమనీ, ఈ ఏడాది మాత్రం అక్టోబర్‌లోనే సమ్మర్ ప్లాన్ సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ అన్నారు. ఆయన చాంబర్లో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. రైవాడ, తాటిపూడి రిజర్వాయర్లతో పాటు ఇతర వనరులకు సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షపాతం తక్కువగా నమోదవడం వల్ల ఆయా రిజర్వాయర్లు కనిష్ట నీటిమట్టానికి చేరువలోకి వచ్చేశాయని తెలిపారు. ఈ ఏడాది అదృష్టవశాత్తూ పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తికావడం వల్ల గోదావరి నుంచి ఏలేరుకి నీటి పంపింగ్ చేయడంతో.. ఏలేరులో ప్రస్తుతం 86.43 మీటర్ల నీటి మట్టం ఉందనీ, ఈ నీరు వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకూ సరిపోతుందని వివరించారు. ఏలేరు మెయిన్ కెనాల్‌ను విస్కో 400 క్యూసెక్కుల కెపాసిటీకి డిజైన్ చేసినప్పటికీ లీకేజీలు, బెండ్ ఏరియాలో ఇబ్బందులు, బలహీనమైన గట్ల కారణంగా 350 క్యూసెక్కుల నీటిని మాత్రం తీసుకోగలుగుతున్నామన్నారు. రానున్న ఎద్దడి దృష్టిలో పెట్టుకొని 90 నుంచి 100 ఎంజీడీల నీటిని కేబీఆర్ పాయింట్‌కు పంపింగ్ చేసేందుకు సుమారు రూ.కోటి వ్యయంతో మరమ్మతులు చేపడుతున్నామనీ, వచ్చే నెల 15తేదీ లోగా ఈ పనులు పూర్తి చేసేస్తామని వివరించారు. అదే విధంగా పదేళ్లుగా వినియోగించని పాత రైవాడ లైన్‌ను వాడేందుకు అవసరమైన మరమ్మతులు చేపట్టామనీ, పంపింగ్ ట్రయల్ రన్ కూడా వేసినట్లు తెలిపారు. ఈ పైప్‌లైన్ ద్వారా మేహాద్రి గెడ్డకు 8 ఎంజీడీ పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. గోదావరి నుంచి మరో 15 ఎంజీడీలు ప్రస్తుతం గోదావరి నుంచి 25 ఎంజీడీ జలాలు తీసుకుంటున్నామనీ, మరో 15 ఎంజీడీ నీటిని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని కమిషనర్ వెల్లడించారు. దీనికి సంబంధించిన అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. మరోవైపు తాటిపూడి రిజర్వాయర్ నుంచి సాగునీటి గేట్లను మూసివెయ్యాలని జలవనరుల శాఖను కోరామనీ, అవి మూసేస్తే కొంత వరకూ తాగునీటి కోసం ఇబ్బందులు తొలగుతాయని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికైతే నీటి సరఫరా సమయం కుదించే ఆలోచన లేదన్నారు. వేసవి కాలంలో కూడా రోజూ మంచి నీటిని నగర ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా నీటిని వృథా చెయ్యకుండా జీవీఎంసీకి సహకరించాలని కోరారు. ట్యాంకర్ల ద్వారా చేసే నీటి సరఫరాలో గృహావసరాలకే మొదటి ప్రాధాన్యమిచ్చేలా విభాగంలో మార్పులు చేస్తున్నామని తెలిపారు. అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు టౌన్‌ప్లానింగ్ సిబ్బంది కారణంగా ఇంటి ప్లాన్ల మంజూరులో ఆలస్యం జరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలో ఆన్లైన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్‌ను దేశంలోనే తొలిసారిగా అమలు చేశారని కమిషనర్ అన్నారు. 2016లో ఈ విధానం అమలైనప్పటి నుంచి ఇప్పటివరకూ జీవీఎంసీ పరిధిలో 9,823 బిల్డింగ్ ప్రొసీడింగ్స్ ఇచ్చామనీ, వీటిలో 8,661 ప్రొసీడింగ్స్ కన్ఫర్మ్ చేశామని తెలిపారు. ప్రజలు సరైన వివరాలు అందిస్తారనే ఉద్దేశంతో ఆన్లైన్లో ప్లాన్ల మంజూరు చేస్తున్నామనీ, అందులో తప్పులు నమోదు చేస్తే చర్యలు తప్పవన్నారు. ఆన్లైన్లో ప్లాన్ కోసం అప్లయ్ చేస్తే 48 గంటల్లో ప్రొసీడింగ్ అప్రూవల్ వస్తుందన్న విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. అక్రమ నిర్మాణాలు చేపడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేహాద్రిగెడ్డపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు మేహాద్రిగెడ్డపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచామని తెలిపారు. 15 మెగా వాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టుకు త్వరలోనే టెండర్లు ఖరారు చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుతో జీవీఎంసీ పరిధిలో మొత్తం 25 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. హౌసింగ్ ఫర్ ఆల్ ప్రాజెక్టులో భాగంగా గ్రేటర్ పరిధిలో 3 విడతల్లో 54,299 ఇళ్లు మంజూరు కాగా ఇందుకోసం 319 ఎకరాలను రెవెన్యూ శాఖ నుంచి తీసుకున్నామనీ, త్వరలో మరో 266 ఎకరాలు సేకరిస్తామని తెలిపారు. ఫేజ్–1లో నిర్మించాల్సిన 4,120 ఇళ్లలో దాదాపు 2వేల ఇళ్ల నిర్మాణం పూర్తయిందనీ, మొత్తం పూర్తి చేసి సంక్రాంతి నాటికి లబ్ధిదారులకు అందజేయ్యాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అదే విధంగా 2019 స్వచ్ఛ సర్వేక్షణ్కు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల బార్సిలోనాలో జరిగిన స్మార్ట్‌సిటీ వరల్డ్ ఎక్స్పో అండ్ కాంగ్రెస్‌లో పాల్గొని నగరంలో ఎదుర్కొనే అనేక సమస్యల్ని ఎలా అధిగమించాలనే అంశాల గురించి చర్చించామని వివరించారు. -
వెంకటేశా.. కుర్చీ వీడవేమయ్యా..?
జీవీఎంసీలో ఒక కీలక ఉన్నతాధికారిని బదిలీ చేస్తూ ఈ నెల 16న ఉత్తర్వులు జారీ అయ్యాయి.. ఆయన స్థానంలో వేరే అధికారిని ప్రభుత్వం నియమించింది. ఆయన వచ్చి జాయినింగ్ ఆర్డర్‌ను ఇన్చార్జి కమిషనర్‌కు సమర్పించారు కూడా..కానీ బాధ్యతలు స్వీకరించడానికి కూర్చీయే ఖాళీగా లేదు.. ఎందుకంటే.. ఇప్పటివరకు ఆ కుర్చీలో ఉన్న అధికారి దాన్ని ఖాళీ చేయకపోవడమే.. అసలు ఖాళీ చేయడం ఆయనకు ఇష్టం లేదు..కుర్చీ ఖాళీ చేయడానికి ఇష్టపడని ఆ అధికారి జీవీఎంసీ ప్రాజెక్ట్స్ ఎస్ఈ వెంకటేశ్వరరావు.. ఇప్పుడే కాదు.. గత మే 14న.. అంతకుముందు మరో రెండుసార్లు కూడా బదిలీ ఉత్తర్వులు వచ్చినా.. ప్రజాప్రతినిధులతో రాయ‘బేరాలు’ నడిపించి వాటిని బుట్టదాఖలు చేయించిన ఘనుడు ఈ ఎస్ఈ.. ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు..తొమ్మిదేళ్లుగా ఇక్కడే తిష్ట వేసి.. ఎస్ఈ స్థాయికి ఎదిగి.. వందల కోట్ల రూపాయల ప్రాజెక్టుల్లో చక్రం తిప్పుతున్న ఈయనగారు కుర్చీని వీడటానికి ఇష్టపడకపోవడంలోని పరమార్థం ఏమిటో?!.. దానికి ఈయన చెబుతున్న సాకు మాత్రం.. తను వెళ్లిపోతే స్మార్‌సిటీ పనులు నిలిచిపోతాయట! సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మహావిశాఖ నగరపాలక సంస్థ. రాష్ట్రంలో అతి పెద్ద కార్పొరేషన్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, రెగ్యులర్ ఉద్యోగులతో కలిపి వేలాదిమంది పని చేస్తున్న కార్పొరేషనూ ఇదే. ఏటా రూ.150 కోట్ల నుంచి రూ.300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. అనకాపల్లి, భీమిలి సహా ఎనిమిది జోన్లుగా విస్తరించి.. స్మార్ట్ సిటీగా ఎంపికైన తర్వాత నిధుల మంజూరు, ఖర్చు మరింత పెరిగింది. బెల్లం చుట్టూ ఈగలు ముసిరిన చందంగా వందల కోట్ల పనులు జరుగుతున్న జీవీఎంసీ నుంచి వేరే కార్పొరేషన్‌కు బదిలీపై వెళ్లాలన్నా, పనిచేస్తున్న జోన్ నుంచి వేరే జోన్‌కు వెళ్లాలన్నా అధికారులు ఇష్టపడటం లేదు. ఫలితంగా వీరున్న చోట అవకతవకలు, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. సాధారణంగా కార్పొరేషన్లో ఒక చోట మూడు నుంచి మూడున్నరేళ్లు మాత్రమే పనిచేయాలి. కానీ ప్రాజెక్టŠస్ ఎస్ఈ వెంకటేశ్వరరావు తొమ్మిదేళ్లుగా ఇంజినీరింగ్ విభాగంలోనే పనిచేస్తూ.. పదోన్నతులు పొందుతూ చివరికి సర్కారు ఆదేశాలనే ధిక్కరిస్తున్నారు. ఈఈగా జీవీఎంసీలో అడుగు కాకినాడలో మున్సిపల్ ఇంజినీర్‌గా పనిచేసిన అనంతరం జీవీఎంసీలో ఈఈగా ప్రస్థానం మొదలెట్టిన వెంకటేశ్వరరావు తొమ్మిదేళ్లలో పలు పదోన్నతులతో ఇక్కడే ఎస్ఈ (ప్రాజెక్టŠస్) స్థాయికి ఎదిగారు. మధ్యలో పలుమార్లు బదిలీ అయినా.. రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలనూ, పలుకుబడిని ఆయుధాలుగా ప్రయోగించి బదిలీని ఆపించుకునేవారు. అలా పాతుకుపోయిన ఆయన గత నాలుగున్నరేళ్లుగా ప్రాజెక్టŠస్ ఎస్‌ఈగానే కొనసాగుతుండటం గమనార్హం. తొమ్మిదేళ్లలో తాజా ట్రాన్స్ఫర్లతో కలిపి నాలుగుసార్లు బదిలీ ఉత్తర్వులు అందుకున్నారు. అయితే.. అప్పటి ఈఎన్సీ(ఇంజినీర్ ఇన్ చీఫ్) చంద్రశేఖర్ కొమ్ముకాయడంతో రెండుసార్లు బదిలీ నుంచి తప్పించుకున్నారు. ఎమ్మెల్యే గణబాబు అండదండలతో తాజా బదిలీని ఆపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కేసు కాగా వెంకటేశ్వరరావుపై తప్పుడు సమాచారం అందించారనే కేసు ఉమ్మడి రాష్ట్రంలో నమోదైంది. తన సర్వీస్ రిజిస్టర్లో డేట్ ఆఫ్ బర్త్ తక్కువ చూపించారని కేసు నమోదు చేశారు. అది ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. కేసు పెండింగ్‌లో ఉన్న సమయంలో ప్రమోషన్లు ఇవ్వకూడదు. కానీ వెంకటేశ్వరరావు పదోన్నతులు సైతం పొందడం గమనార్హం. ఇంకా ఎన్నేళ్లు చేస్తావయ్యా..? ఈ నెల 20న స్మార్ట్‌సిటీ పనులపై పురపాలక శాఖ మంత్రి నారాయణ జీవీఎంసీలో సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల పురోగతి లోపభూయిష్టంగా ఉందంటూ ఎస్ఈ వెంకటేశ్వరరావుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లలో రూ.511 కోట్ల పనులు పూర్తి చేయాల్సి ఉండగా కేవలం రూ.113 కోట్ల పనులే ఎందుకు జరిగాయి.. నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. ఓవైపు.. తాను లేకపోతే.. ప్రాజెక్టులు ఆగిపోతాయన్నట్లుగా ఉన్నతాధికారులకు నివేదికలు చూపించి బదిలీ నిలిపివేయించుకుంటున్న ఎస్ఈ పనితీరు.. సమీక్షలో తేటతెల్లమైంది. సమావేశం అనంతరం.. మంత్రి నారాయణతో బదిలీ అంశంపై ఎస్ఈ మాట్లాడగా.. తొమ్మిదేళ్లుగా జీవీఎంసీలో చేస్తున్నావ్ కదా.. ఇంకా ఎన్నేళ్లు చేస్తావయ్యా అని మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు ఇంజినీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. స్మార్ట్ పనులు ఆగిపోతాయంట..? ప్రస్తుతం నగరంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో రూ.1542 కోట్ల పనులతో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులు రూ.350 కోట్లు, అమృత్ పథకం కింద రూ.250 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి ప్రాజెక్టు కింద రూ.750 కోట్ల పనులు జరుగుతున్నాయి. వీటికి డీపీఆర్‌ల తయారీ నుంచి డిజైన్లు, డ్రాఫ్ట్సు రూపొందించడం, టెండర్లు.. తదితర అన్ని పనులూ వెంకటేశ్వరరావు చేతుల మీదుగానే సాగుతున్నాయి. ఈ ఏడాది మే 14న అనంతపురం ఎస్ఈగా అతన్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాను వెళ్లిపోతే స్మార్ట్ సిటీ పనులు ఆగిపోతాయని స్థానిక ప్రజాప్రతినిధులతో సిఫారసు చేయించుకుని బదిలీ ఆపించుకున్నారు. తాజాగా ఈ నెల 16న వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో మరియన్నను నియమిస్తున్నట్లు కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరియన్న వచ్చి జాయినింగ్ ఆర్డర్ కాపీని జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ బసంత్‌కుమార్‌కు ఇప్పటికే అందించారు. అయినా వెంకటేశ్వరరావు మాత్రం కుర్చీ వదలడం లేదు. రిలీవ్ కావడం లేదు. అనంతపురం వెళ్లాల్సిందే రెండు నెలల క్రితం ఎస్ఈ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ జీవో జారీ చేసిన మాట వాస్తవమే. అయితే కొన్ని కారణాల వల్ల దాన్ని అమలు చేయలేకపోయాం. ఈసారి మాత్రం జీవీఎంసీలో రిలీవ్ అయ్యి అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈగా వెళ్లాల్సిందే. కమిషనర్ హరినారాయణన్ సెలవు నుంచి రాగానే ఎస్ఈని రిలీవ్ చేయాలని ఆదేశాలు జారీ చేస్తాను. – కరికల వలవన్,మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి -
అక్రమార్జనలో రారాజు
సాక్షి, విశాఖ క్రైం : మున్సిపాలిటీలో వెలుగులు నింపాల్సిన ఆ అధికారి అవినీతి మురుగులో పీకల్లోతున కూరుకుపోయాడు. ఉద్యోగంలో చేరింది మొదలు... అందినకాడికి వెనకేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగడంతో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టేశాడు. ఎట్టకేలకు పాపం పండడంతో అక్రమార్జనలో రారాజుగా వెలుగొందిన శ్రీకాకుళం మున్సిపాలిటీ డీఈఈ గొట్టిముక్కల శ్రీనివాసరాజుతోపాటు బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకకాలంలో సోదాలు చేసి రూ.30 కోట్లకు పైగా అక్రమాస్తులు వెనకేసుకున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర వెల్లడించారు. బంగారమే బంగారం శ్రీనివాసరాజు ఇంటిలో సోదాల సమయంలో 423.3గ్రాముల బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు అక్కయ్యపాలెం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని లాకర్లో భార్య పేరు మీద 151.78గ్రాములు బంగారు వస్తువులు, డాబాగార్డెన్స్‌లో గల బ్యాంకు ఆఫ్ ఇండియాలో భార్య జి.రాజేశ్వరి పేరు మీద లాకర్లో 221.970 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా 795 గ్రాములకుపైగా బంగారు ఆభరణాలు గుర్తించారు. 1548 గ్రాముల వెంటి వస్తువులు లభ్యమయ్యాయి. అదేవిధంగా నగదు రూ.12 లక్షల 27వేలు, బ్యాంక్ బ్యాలెన్స్ రూ.5లక్షల 45 వేలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వం ధర ప్రకారం రూ.1.64కోట్లు ఉంటుందని, మార్కెట్ విలువ మాత్రం రూ.30 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. గుర్తించిన అక్రమాస్తులివీ... విశాఖ నగర పరిధిలోని సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్స్న్ దరి పాపాహోం సమీపంలో గల ఆర్.ఆర్.రెసిడెన్సీలోని ప్లాట్ నెంబర్ 302లో శ్రీనివాసరాజు నివాసముంటున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఆయన ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కోవలి గ్రామంలో ఎక్కువగా శ్రీనివాసరాజు భూమి కొనుగోలు చేశారు. తొలిసారిగా ఈ గ్రామంలో 6.82 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. అదే గ్రామంలో 7.2 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. తల్లి జి.స్వరాజ్యం పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 417/1, 418/1లో 3.19 ఎకరాలు భూమి కోనుగోలు చేశారు. అదే గ్రామంలో తండ్రి జి.కృష్ణంరాజు పేరు మీద సర్వే నెంబర్ 417/2, 449/2లలో వ్యవసాయ భూమి 2.69 ఎకరాలు కోనుగోలు చేశారు. శ్రీనివాస రాజు మామయ్య వి.నారాయణరాజు పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 416/1లో 2.49ఎకరాల వ్యవసాయ భూమి కోనుగోలు చేశారు. అదే గ్రామంలో సర్వే నెంబర్ 416/52, 416/3, 417 – 1,418 లో 4.71 ఎకరాలు కోనుగోలు చేశారు. శ్రీనివాసరాజు అత్తమ్మ వి.వరలక్ష్మి పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 887/1, 887/2లో 3.6ఎకరాలు భూమి కోనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం నర్శింహపురం గ్రామంలో భార్య పేరిట సర్వే నెంబర్ 75/2లో 697.44 గజాల స్థలం. అదే గ్రామంలోని సర్వే నెంబర్ 75/2లో ఖాళీ స్ధలం 7.20 ఎకరాలను కుమార్తె జి.మౌనిక పేరు మీద కోనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పెద్ద అమిరాం గ్రామంలో భార్య రాజేశ్వరి పేరు మీద సర్వే నెంబర్ 487/1, 487/2, 487/2బిలలో 697.44 గజాల స్థలం. విశాఖ జిల్లా అడవివరం గ్రామంలో భార్య జి.రాజేశ్వరి పేరు మీద సర్వే నెంబర్ 275 / 30 – ఎలో 183 గజాల ఇంటి స్థలం కొనుగోలు చేశారు. అలాగే శ్రీనివాస రాజు రెండు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సర్వీసులో 25 ఏళ్లకుపైగా జీవీఎంసీలోనే అవినీతి ఊబిలో కూరుకుపోయిన శ్రీనివాసరాజు తన సర్వీసులో ఎక్కువ కాలంలో జీవీఎంసీలోనే తిష్ట వేశారు. బదిలీపై వెళ్లినప్పటికీ మళ్లీ వెంటనే వెనక్కు వచ్చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని వెంప గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు జీవీఎంసీలో 1988లో వర్క్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేరారు. అనంతరం 2000వ సంవత్సరంలో ఏఈగా ప్రమోషన్ వచ్చింది. అప్పటి నుంచి 2012 వరకు జీవీఎంసీలో ఏఈగా పనిచేశారు. 2012లో బొబ్బిలి మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లారు. అక్కడ 18 నెలలు పని చేసి మళ్లీ ఏఈగా జీవీఎంసీకి బదిలీపై వచ్చారు. అనంతరం 2017లో ఉద్యోగోన్నతి రావడంతో శ్రీకాకుళం మున్సిపాలిటీకి డీఈఈగా వెళ్లారు. అయితే జీవీఎంసీలో పనిచేసిన కాలంలో కొందరు అధికారులతోపాటు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఓ ప్రజాప్రతినిధితో కలిసి బినామీల పేరున భారీగా పనులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బినామీల గుట్టు విప్పేందుకు కూడా ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. -
అర‘వీర’ అక్రమార్కుడు
ఎన్నెమ్మార్ నుంచి ఏఈఈ స్థాయికి.. అదే స్థాయిలో అక్రమాస్తులు ఏఈఈ ఆస్తులపై ఏకకాలంలో ఏసీబీ సోదాలు రూ.1.50 కోట్ల ఆస్తులు స్వాధీనం బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.15 కోట్ల పైమాటే ద్వారకానగర్: బుధవారం తెల్లవారు జామున.. 5 గంటల ప్రాంతంలో.. కొందరు వ్యక్తులు దసపల్లా హిల్స్‌లోని సాయిమహరాజ్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. ఫ్లాట్ నెం. 502 తలుపు తట్టారు. తలుపు తీసిన ఇంట్లోని వ్యక్తులు వచ్చిన వ్యక్తులు ఏసీబీ అధికారులని తెలుసుకుని గతుక్కుమన్నారు. వారు సర్దుకునేలోపే అధికారుల బందం తమ పని మొదలుపెట్టేసింది. జీవీఎంసీ జోన్–2 ఏఈఈ(అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) వీరమాధవరావుకు చెందిన ఆ ఇంట్లో సోదాలు ప్రారంభించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ముందస్తు ప్లాన్ ప్రకారం ఏసీబీ అధికారులు వీరమాధవరావు ఇంటితోపాటు నగరం, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆయన బంధువులు, కుటుంబ సభ్యులతోపాటు, డ్రైవర్ ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. డాబాగార్డెన్స్, ఎండాడ, దసపల్లా, పెందుర్తి, పి.ఎం.పాలెం, భీమిలి, దేవరాపల్లితో పాటు పలు ప్రాంతాల్లో జరిపిన ఈ సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తులు, విలువైన డాక్యుమెంట్లు లభించాయి. ఆస్తుల వివరాలు ఈ తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో పాటు బంగారం, వెండి ఆభరణాలు, నగదు, ఇళ్లు, స్థలాలకు చెందిన పత్రాలు బయటపడ్డాయి. సాయంత్రం వరకు జరిపిన సోదాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 1.5 కోట్ల విలువైన ఆక్రమ ఆస్తులు గుర్తించారు. వెతుకుతున్న కొద్దీ ఆస్తులు బయటపడుతున్నాయని దాడులకు నాయకత్వం వహించిన ఏసీబీ డీఎస్పీ కె.రామకష్ణప్రసాద్ చెప్పారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. మాధవరావుకు డాబాగార్డెన్స్‌లో మూడు జీ+2, ఒక జీ+1 భవనాలు ఉన్నాయి. దేవరాపల్లి మండలం ఈతంపేటలో 8 ఎకరాల పామాయిల్ తోట, పెందుర్తి ఎస్వీఎల్ఎన్ టవర్స్‌లో ఒక ఫ్లాట్, ఎండాడలో ఒక ప్లాటు, భీమిలి మండలం కొత్తవలస 500 గజాలు, భీమిలిలో 300 గజాలు, చీమలాపల్లిలో 187 గజాలు, డాబాగార్డెన్స్‌లో 145 గజాలు, దేవరాపల్లి మండలం తాడువాయిలో 50 సెంట్ల స్థలాలు ఉన్నట్లు లభించిన డాక్యుమెంట్లను బట్టి తేలింది. అలాగే ఒక ఫోర్డు కారు, 20 తులాల బంగారం, ఆర కేజీ వెండితో పాటు రూ. 50 వేల నగదు సోదాల్లో లభించాయి. దొండపర్తి ఆంధ్రా బ్యాంక్‌కు చెందిన లాకర్ తాళాలు, మాధవరావు కుమార్తె పేరుతో పి.ఎం.పాలెంలోని కెనరా బ్యాంక్ లాకర్‌కు సంబంధించి తాళాలు లభించాయి. మాధవరావు డ్రైవర్ ఇంట్లో ఎస్వీఎన్ఎల్ టవర్స్‌లోని ఫ్లాట్‌కు చెందిన పత్రాలు స్వాధీనపరుచుకున్నారు. ఇప్పటివరకు వేసిన లెక్కల ప్రకారం ఈ ఆస్తుల విలువ సుమారు రూ. 1.50 కోట్లు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ. 15 కోట్లపైగా ఉంటుందని చెప్పారు. మాధవరావుకు ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయన్నది ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఎన్నెమ్మార్ స్థాయి నుంచి.. కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టిన మాధవరావు స్వస్థలం విశాఖ నగరమే. స్థానిక సింగ్ హోటల్ జంక్షన్‌కు చెందిన ఆయన 1987లో సాధారణ ఎన్నెమ్మార్గా జీవీఎంసీలో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. డిపో్లమా చేసి 1997లో వర్క్ ఇన్స్పెక్టర్ ఉద్యో గం పొందారు. 2005–06లో బీఈ చేసి అసిస్టెంట్ ఇంజినీర్ హోదా పొందారు. తరువాత బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా ఐదేళ్లు చేసిన అనంతరం ప్రస్తుతం వర్క్స్ ఏఈఈగా పని చేస్తున్నారు. అగ్రిగోల్డ్ డైరెక్టర్‌గానూ.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇతర ఏ సంస్థల్లోనూ పని చేయరాదు. కానీ వీరమాధవరావు. కొంతకాలం క్రితం ఖాతాదారులకు టోపీ పెట్టి మూతపడిన అగ్రిగోల్ట్ సంస్థలో డైరెక్టర్‌గా కూడా చేసినట్లు ఆధారాలు లభించాయి. దానికి సంబంధించిన గుర్తింపు కార్డు ఏసీబీ సోదాల్లో దొరికింది. అలాగే చిట్టీలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలిసింది. -
జీవీఎంసీ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు
విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ)లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న వీర మాధవరావు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. బుధవారం ఉదయం ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏకకాలంలో మాధవ రావు ఇల్లు, బంధువులు, స్నేహితుల ఇళ్లపై దాడులు జరిపారు. సుమారు రూ. కోటి 50 లక్షల ఆస్తులను గుర్తించారు. 20 తులాల బంగారం, కెనరాబ్యాంకు లాకర్లో నగదు ఉన్నట్లు గుర్తించారు. దేవరపల్లిలో 8 ఎకరాలు, భీమిలిలో 300 గజాల స్థలం, దాబాగార్డెన్స్‌లో జీ ప్లస్2 ఇల్లు, పెందుర్తిలో కూతురు మామ గారి లాకర్లో 36 తులాల బంగారాన్ని అధికారులు కనుగొన్నారు. మాధవరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.