జీవీఎంసీ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు
విశాఖపట్నం: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ)లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న వీర మాధవరావు ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. బుధవారం ఉదయం ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏకకాలంలో మాధవ రావు ఇల్లు, బంధువులు, స్నేహితుల ఇళ్లపై దాడులు జరిపారు. సుమారు రూ. కోటి 50 లక్షల ఆస్తులను గుర్తించారు. 20 తులాల బంగారం, కెనరాబ్యాంకు లాకర్‌లో నగదు ఉన్నట్లు గుర్తించారు. దేవరపల్లిలో 8 ఎకరాలు, భీమిలిలో 300 గజాల స్థలం, దాబాగార్డెన్స్‌లో జీ ప్లస్2 ఇల్లు, పెందుర్తిలో కూతురు మామ గారి లాకర్లో 36 తులాల బంగారాన్ని అధికారులు కనుగొన్నారు. మాధవరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.