సగం సీట్లు ఖాళీ | Half the seats empty | Sakshi
Sakshi News home page

సగం సీట్లు ఖాళీ

Jun 29 2016 12:34 AM | Updated on Aug 17 2018 3:08 PM

సగం సీట్లు ఖాళీ - Sakshi

సగం సీట్లు ఖాళీ

జిల్లాలో చాలా ఇంజినీరింగ్ కళాశాలల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. సోమవారం రాత్రి ఎంసెట్ అడ్మిషన్ల తొలివిడత సీట్ల భర్తీకి..

ఇంజినీరింగ్ సీట్లు భర్తీ అయ్యేనా?
యూనివర్సిటీ కళాశాలల్లో సీట్లు ఫుల్
{పైవేట్ కళాశాలల్లో అరకొర అడ్మిషన్లు
భర్తీ కాని సీట్ల సంఖ్య 8 వేలు
50శాతం భర్తీకాని  కాలేజీల సంఖ్య 10

 

జిల్లాలో చాలా ఇంజినీరింగ్ కళాశాలల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. సోమవారం రాత్రి ఎంసెట్ అడ్మిషన్ల తొలివిడత సీట్ల భర్తీకి సంబంధించి సీట్ల కేటాయింపు జరిగింది. దాదాపు 8 వేల సీట్లు ఖాళీగా మిగిలిపోవడం విశేషం. గత ఏడాది 6 వేల సీట్లు మిగిలిపోతే ఈ యేడాది ఈ సంఖ్య పెరగడం పట్ల కళాశాల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశానికి ఏప్రిల్ 29న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. 11వేల 236 మంది ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేశారు. 10వేల 793 మంది ప్రవేశ పరీక్ష రాశారు. 9,800 మంది అర్హత సాధించారు.

 

యూనివర్సిటీ క్యాంపస్: జిల్లాలోని చాలా ఇంజినీరింగ్ కళాశాలల్లో తొలివిడత సీట్ల ప్రకటన తర్వాత ఎక్కువ సీట్లే మిగిలిపోయాయి. 39 ఇంజినీరింగ్ కళాశాలలతోపాటు  2 యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ప్రయివేటు రంగంలోని 39 కళాశాలలు జేఎన్‌టీయూ అనంతపురానికి  అనుబంధంగా ఉన్నాయి. వీటిలో దాదాపు 16వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈనెల 6 నుంచి జరిగిన వెబ్ కౌన్సెలింగ్‌కు 6,260 మంది హాజరయ్యారు. 6,100 మంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. వీరిలో దాదాపు 6వేల మందికి సీట్ల కేటాయింపు జరిగింది. అందుబాటులో ఉన్న 16వేల సీట్లలో మేనేజ్‌మెంట్ కోటా పోగా 8 వేల సీట్లు మిగిలాయి.

 
ఎస్వీయూలో...

ఎస్వీ యూనివర్సిటీలో సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఈఈఈ, కెమికల్ బ్రాంచిల్లో 360 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ భర్తీ అయ్యాయి. 97 ర్యాంకు నుంచి 6000 లోపు ర్యాంక్ పొందిన వారందరికీ సీట్లు వచ్చాయి. వీరు జూలై 1 లోపు రిపోర్ట్ చేయాలి. గత ఏడాది 250 మంది మాత్రమే చేరారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా 360 సీట్లు భర్తీ అయినప్పటికీ ఎన్‌ఐటీ, ఐఐటీలో  సీట్లు రావడంతో 110 మంది వెళ్లారు. ఈసారి విద్యార్థులు వెళ్లే అవకాశం లేదు.

 
ప్రైవేట్ కళాశాలల్లో...
జిల్లాలోని 39 ఇంజినీరింగ్ కళాశాలల్లో చాలా వరకు సీట్లు మిగిలిపోయాయి. కొన్ని గుర్తింపు పొందిన కళాశాలలకు సీట్లు పూర్తిగా భర్తీకాగా చాలా కళాశాలల్లో సీట్లు మిగిలిపోయాయి. 50శాతం కంటే ఎక్కువ సీట్లు మిగిలిన కళాశాలల్లో 10 వరకు ఉన్నాయి.

 

 

మహిళా యూనివర్సిటీలో..
శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలో మెకానికల్, ఈసీఈ, ఈఈఈ, సీఎస్‌ఈ లలో 360 సీట్లు ఉన్నాయి. వీటిలో గత ఏడాది 36 సీట్లు మిగిలాయి. ఈ సంవత్సరం ఎంసెట్ తొలి విడత కౌన్సెలింగ్ ద్వారా 360 సీట్లు భర్తీ అయ్యాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement