మదనపల్లె: అప్పుల బాధ తాళలేక నేతన్న ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కొల్లబైలు పంచాయతి గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బండి వెంకటరమణ(28) నేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పులు ఎక్కువ కావడంతో వాటిని తీర్చే దారి కానరాక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చే సుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో నేతన్నఆత్మహత్య
Published Fri, Nov 6 2015 9:12 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement