హంద్రీ-నీవా పనులకు ఆటంకం
రేగడదిన్నేపల్లి (శాంతిపురం): పరిహారం ఇవ్వకుండా, ఒప్పంద పత్రాలు లే కుండా తవు భూవుుల్లో కాలువ తవ్వకాలకు జరి గిన ప్రయుత్నాలను రేగడదిన్నేపల్లి రైతులు అడ్డుకున్నారు. గురువారం కాంట్రాక్టర్లు తవ్వకం పనులు ప్రారంభించిన వెంటనే రైతులు అడ్డు తగిలారు. దీంతో పనులు ఆపేసిన కాంట్రాక్టర్లు వుళ్లీ సాయుంత్రం మొదలు పెట్టారు. ఆగ్రహించిన రైతులు ప్రొక్లెయినర్‌ను అడ్డుకున్నారు. తవు భూములు ఎంత మేరకు కాలువకు పోతాయో, పరిహారం ఎప్పటికి ఇస్తారో చెప్పకుండా పనులు చేయడాన్ని అంగీకరించబోవుని తేల్చిచెప్పారు. స్థానిక సర్పంచ్ శ్రీనివాసులు రైతులకు వుద్దతు తెలిపారు.
జేసీ భరత్‌నారాయుణగుప్త గతంలో చెప్పిన ప్రకారం భూవుులు కోల్పోయే వారితో ఒప్పంద పత్రాలు రాసుకోకనే పనులు ఎలా మొదలు పెడతారని ఆయున ప్రశ్నించారు. ఎట్టకేలకు గురువారం రాత్రి తహశీల్దార్ కల్పనాకువూరి రైతులతో జరిపిన చర్చలు ఫలించారుు. జూన్ నెలాఖరులోగా అందరికీ పరిహారం అందించే బాధ్యతను తాను తీసుకుంటానని తహశీల్దార్ హామీ ఇవ్వటంతో రైతులు శాంతించారు