సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ ప్రభుత్వ వేధింపుల పర్వం కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత జోగి రమేష్‌ను మరోసారి విచారణ నిమిత్తం నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ అరండల్‌పేట పోలీసులు ఆదేశాలిచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హత్య కేసులో నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త అంటూ సోషల్ మీడియాలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్డు వైరల్ అయిన సంగతి తెల్సిందే. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సభ్యత్వ కార్డు విషయమై వైఎస్సార్‌సీపీ జోగి రమేష్ ప్రెస్‌మీట్ పెట్టడమే ఆయన తప్పయింది.
ఈ విషయాన్ని పట్టుకుని పోలీసుల ద్వారా టీడీపీ నేతలు వేధింపులకు గురిచేస్తున్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదుతో జోగి రమేష్‌పై కేసు నమోదు చేసి విచారణ పేరుతో పలుమార్లు తమ చుట్టూ తిప్పుకుంటూ వేధించసాగారు. ఇప్పటికే జోగిరమేష్‌ను పలుమార్లు పోలీసులు విచారించారు. తాజాగా మరోసారి విచారణకు రమ్మని ఆదేశాలు జారీ చేశారు. పదే పదే విచారణ పేరుతో కక్ష గట్టి జోగి రమేష్‌ను ప్రభుత్వం వేధిస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ నాయకులపై కొనసాగుతోన్న వేధింపులు
Published Sat, Dec 15 2018 10:41 AM | Last Updated on Sat, Dec 15 2018 11:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment