అమలుకాని ఏపీ సీఎం హామీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డుల వ్యవహారం ‘అప్పు రేపు’లా తయారైంది. అధికారంలోకి వచ్చిన వెంటనే హెల్త్‌కార్డులు ఇస్తామని హామీ ఇచ్చిన తెలుగుదేశంపార్టీ మాటమార్చింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇస్తామని చెప్పినా వాయిదా పడింది. ఆ వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... సెప్టెంబర్ 1 నుంచి హెల్త్‌కార్డుల పథకాన్ని అమలు లుచేస్తామని ప్రకటించారు. అదీ దాటి ఇప్పుడు దసరాకు అంటున్నారు. దసరాకైనా వస్తాయనే నమ్మకం లేదని ఉద్యోగులు చెబుతున్నారు.
ఆరోగ్యశ్రీ ధరలకు అంగీకరించని ఆసుపత్రులు
ఉద్యోగులకు చికిత్స గరిష్ట పరిమితిని రూ. 2 లక్షలుగా ప్రభుత్వం నిర్ధారించింది. పరిమితి దాటినా చికిత్స ఆగదని, అవసరమైన పక్షంలో కేసును బట్టి పరిమితి పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీనికి ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా మార్చడానికి రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం.. ఈ పథకం కింద గరిష్ట చికిత్స వ్యయా న్ని రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచాలని నిర్ణయించింది.ఉద్యోగులకు గరిష్ట పరిమితిని రూ. 2 లక్షలకు మించి పెంచడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. వారికీ ఆరోగ్యశ్రీ ధరల్లోనే చికిత్స అందించాలనే ప్రభు త్వ ప్రతిపాదనకు కార్పోరేట్ ఆసుపత్రులు అంగీకరించలేదని సమాచారం. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం చొరవ తీసుకొని ఆసుపత్రుల యాజమాన్యాలతో మాట్లాడితే.. సమస్యకు పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ తీరుపట్ల విస్మయం వ్యక్తమవుతోంది.
ఉద్యోగులకు హెల్త్‌కార్డులు మరింత జాప్యం
Published Tue, Sep 9 2014 1:08 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement