
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. సిట్ కార్యాలయంలో బుధవారం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. నిందితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు పేర్కొన్నారు. బీపీ, పల్స్‌రేటు బాగానే ఉన్నట్టు తెలిపారు.
మరోవైపు ఈ రోజు ఉదయం నుంచి నిందితుడి కాల్ డేటా ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఫోన్ కాల్స్ ఆధారంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం పాత గణేశునిపాడుకు చెందిన నాగూర్ వలి కుటుంబాన్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాగూర్ వలి ఇచ్చిన సమాచారంతో మరికొంత మందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిందితుడిని చూడాలంటూ అతని తల్లిదండ్రులు కోరడంతో వారిని పోలీసులు విశాఖకు తీసుకెళ్లారు.
సంబంధిత కథనాలు:
Comments
Please login to add a commentAdd a comment