తుది విడత ఏపీ మెడికల్ కౌన్సెలింగ్ సోమవారంతో ముగిసింది. కౌన్సెలింగ్ ముగిసే సమయానికి మొత్తం 2, 648 ఎంబీబీఎస్, 709 బీడీఎస్ సీట్లు భర్తీ అయ్యాయి. చివరి రోజు జరిగిన కౌన్సెలింగ్‌లో ఏయూ అభ్యర్థులకు మాత్రమే సీట్లు అందుబాటులో ఉండగా, ఇందులో ఎస్‌టీ మహిళా కేటగిరీకి చెందిన రెండు ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేశారు. ఎస్‌టీ కేటగిరీలో ఏయూలో 16, 296 ర్యాంకు వద్ద ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ముగిసింది. బీడీఎస్‌లో ఎస్‌సీ కేటగిరీలో 16,263, ఎస్‌టీ కేటగిరీలో 23,322, బీసీలో 15,564 ర్యాంకు వద్ద సీట్ల భర్తీ ముగిసింది. స్పెషల్ కేటగిరీ కింద ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఎన్‌సీసీ కోటా సీట్లకు కౌన్సెలింగ్ జరగనుంది. స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌కు సంబంధించి మెరిట్ జాబితాలను రెండు రాష్ట్రాల క్రీడా ప్రాధికార సంస్థలు సోమవారం కూడా అందజేయలేక పోయాయి. ఏపీ ప్రైవేటు మెడికల్ కళాశాలల్లోని బి-కేటగిరీ సీట్లకు మంగళవారం కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. సుమారు 19 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ముగిసిన తుది విడుత కౌన్సెలింగ్
Published Mon, Sep 28 2015 9:45 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM
Advertisement
Advertisement