'హృదయ'పూర్వకంగా.. మంగళగిరి నుంచి చెన్నైకి | heart from guntur to Chennai | Sakshi
Sakshi News home page

'హృదయ'పూర్వకంగా.. మంగళగిరి నుంచి చెన్నైకి

Published Fri, Mar 6 2015 12:56 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

'హృదయ'పూర్వకంగా.. మంగళగిరి నుంచి చెన్నైకి - Sakshi

'హృదయ'పూర్వకంగా.. మంగళగిరి నుంచి చెన్నైకి

గుంటూరు : దేశం మొత్తం హోలీ సంబరాల్లో మునిగి తేలుతుంటే ఆ కుటుంబం మాత్రం విషాదంలో మునిగిపోయింది. అయినా ఆ కుటుంబం  పెద్ద మనసు చేసుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన తమ ఆత్మీయుడి  అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చింది. రెండు రోజులు క్రితం  విజయవాడలో  జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు  డ్రైవర్ మణికంఠ తీవ్రంగా గాయపడ్డాడు.  

ఆ యువకుడి  బ్రెయిన్ డెడ్ అయినట్టుగా మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. దీంతో అతని గుండె, లివర్, కాలేయం, కళ్లు, కిడ్నీలు దానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు.  చెన్నై ఫోర్టిస్ ఆస్పత్రిలోని చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి ఆ యువకుడి గుండెను అమర్చనున్నారు. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నైకి తరలించేందుకు  ఏర్పాట్లు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement